రాధేశ్యామ్‌ ను ఊరిస్తున్న రూ.350 కోట్ల డీల్‌!!

Update: 2022-01-03 01:30 GMT
ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్‌ గా రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ వారు నిర్మించిన చిత్రం 'రాధేశ్యామ్‌'. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కాబోతుంది. ఇప్పటి వరకు అయితే విడుదల అవుతుందనే అంటున్నారు.. కాని మరో మూడు నాలుగు రోజుల తర్వాత కూడా విడుదల అవుతుంది అని అంటామా లేదా తెలియడం లేదు. ఎందుకంటే ఉత్తర భారతం మెల్ల మెల్లగా లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో నైట్‌ కర్ఫ్యూలు.. ఆంక్షలు మొదలు అయ్యాయి. రాధే శ్యామ్‌ సౌత్‌ లో ఎంత బజ్‌ ను కలిగి ఉందో నార్త్‌ లో కూడా అంతే బజ్ ను కలిగి ఉంది. అక్కడ నుండి మేకర్స్ భారీ వసూళ్లను ఆశిస్తున్నారు. హిందీ వర్షన్ ను వేరుగా చిత్రీకరించారంటే ఏ స్థాయిలో అక్కడ వసూళ్లను దక్కించుకోవాలో మీరే అర్థం చేసుకోండి.

ప్రస్తుత పరిస్థితుల్లో అంతటి అంచనాలతో రాధే శ్యామ్‌ విడుదల అయితే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక సారి ఊహించుకోండి.. ఖచ్చితంగా వస్తాయనుకున్న వసూళ్లలో కనీసం 40 నుండి 50 శాతం కూడా రాకపోవచ్చు. విడుదల తేదీ సమీపిస్తున్న సమయంకు కనీసం ఆ మాత్రం థియేటర్లు కూడా నడిచే అవకాశాలు ఉండక పోవచ్చు. అందుకే 90 శాతం వరకు రాధే శ్యామ్‌ సంక్రాంతి బరిలో లేనట్లే అంటున్నారు. మేకర్స్‌ మొండిగా పట్టుదలతో సినిమాను విడుదల చేయాలనుకుంటే తప్ప రాధే శ్యామ్‌ విడుదల ఉండదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే రాధే శ్యామ్‌ సినిమా ను ఓటీటీ ఆఫర్‌ లు ఊరిస్తున్నాయట. ప్రముఖ ఓటీటీ సంస్థ లు ఈ సినిమా కు డైరెక్ట్‌ రిలీజ్ కు ఏకంగా 300 కోట్ల వరకు ఆఫర్‌ చేస్తున్నాయట. సినిమాను ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తే ఒక ఓటీటీ 350 కోట్ల వరకు కూడా ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరి రాధే శ్యామ్‌ ఆ ఆఫర్ ను లెక్క చేస్తుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.

ఓటీటీ ద్వారా విడుదల అయితే ఎక్కువ శాతం ప్రేక్షకులను కూడా ఇబ్బంది లేకుండా కలుసుకోవచ్చు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాని రాధే శ్యామ్‌ ట్రైలర్ చూస్తుంటే సినిమా విజువల్‌ వండర్‌ గా ఉండబోతుందని.. ఇది ఒక అందమైన ప్రేమ కథ అని.. అందుకే థియేటర్‌ లో చూస్తేనే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే రాధే శ్యామ్‌ సినిమా ను ఆలస్యం అయినా కూడా థియేటర్ లోనే చూడాలని ఆశ పడుతున్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాధే శ్యామ్‌ సినిమా విడుదల విషయంలో ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. ఇప్పటికే జక్కన్న ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా వాయిదా పడటం.. రాధే శ్యామ్‌ కూడా విడుదల వాయిదా పడుతుందనే ఉద్దేశ్యంతో ఆ తేదీలోనే చిన్న సినిమాలు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.
Tags:    

Similar News