అరగంట సీన్.. అర్ధరాత్రైనా కాలేదు..!
రాజమౌళి సినిమా ఎందుకు 2, 3 ఏళ్లు చేస్తాడు.. అసలు ఆయనకే ఇలా ఎక్కువ టైం ఎందుకు పడుతుంది.
రాజమౌళి సినిమా ఎందుకు 2, 3 ఏళ్లు చేస్తాడు.. అసలు ఆయనకే ఇలా ఎక్కువ టైం ఎందుకు పడుతుంది. ఇలా ఏళ్లకు ఏళ్లు తీస్తే సినిమా ప్రొడక్షన్ కాస్ట్ పెరగదా అని అంటున్నారు. కానీ ఇలా అనే వారికి తన సినిమాల రికార్డులతో సమాధానం ఇస్తాడు. బాహుబలితో ఆయన తనను అసలు అనే ఛాన్స్ ఇచ్చే ఛాన్స్ ఇవ్వట్లేదు. ఆఫ్టర్ బాహుబలి ఎన్టీఆర్, చరణ్ తో మటీస్టారర్ గా RRR చేశాడు. ఈ సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్ లో తన స్టామినా చూపించాడు రాజమౌళి.
ఐతే రాజమౌళి సినిమాలో పనిచేసిన వాళ్లు ఆయన గురిచి బాగా చెబుతాడు. సినిమా సెట్స్ లో ఆయన నటీనటులు, టెక్నికల్ టీం నుంచి తీసుకునే అవుట్ పుట్ పై ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తారు. ఈ క్రమంలో రాజమౌళిని పని రాక్షసుడని అందరు చెబుతుంటారు. ఐతే అసలు రాజమౌళికి జక్కన్న అనే బిరుదు ఎవరు ఇచ్చారు అనే డౌట్ వస్తుంది. అంతకుముందు ఎన్ టీ ఆర్ పేరు వినబడ్డా రాజమౌళికి జక్కన్న పేరు పెట్టింది రాజీవ్ కనకాల అని తెలుస్తుంది.
ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో రాజమౌళితో పనిచేసిన అనుభవం గురించి ఆయన చెప్పారు. రాజమౌళితో శాంతినివాసం టైం నుంచి రాజీవ్ కనకాల కలిసి పనిచేశాడు. అందుకే ఆయన వర్క్ గురించి ప్రత్యేకంగా చెబుతాడు. ఐతే ఒక సినిమా షూటింగ్ లో అరగంట సీన్ కు అర్ధరాత్రి వరకు షూట్ చేశాడు. సీన్ పర్ఫెక్షన్ కోసం రాజమౌళి పడే తపన చూసి పని రాక్షసుడు సీన్ ని జక్కన్న చెక్కినట్టు చెక్కుతాడని అన్నాడట.
అక్కడ నుంచి రాజమౌళికి మరో పేరుగా జక్కన్న అని వచ్చింది. స్టూడెంట్ నంబర్ 1 నుంచి మొదలైన రాజమౌళి సినిమాల సక్సెస్ ఫాం RRR వరకు కొనసాగుతుంది. నెక్స్ట్ రాజమౌళి మహేష్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు 1000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది. కచ్చితంగా ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్ లో భారీ క్రేజ్ తెచ్చుకుంటుందని చెప్పొచ్చు.
రాజమౌళి ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ ఒక లెక్కైతే మహేష్ తో చేసే సినిమా ఒక లెక్క అని తెలుస్తుంది. SSMB 29 ఫారెస్ట్ అడ్వెంచర్స్ మూవీగా వస్తుంది. ఈ సినిమాను 2 ఏళ్లలో పూర్తి చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. రాజమౌళి మహేష్ సినిమాకు హాలీవుడ్ టీం కూడా పనిచేస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకు కాస్టింగ్ ని ఎంపిక చేసే బిజీలో ఉన్నారు రాజమౌళి అండ్ టీం.