OTT డీల్స్.. మేకర్స్ జాగ్రత్త పడాల్సిందేనా?

ఇప్పటికే దేశంలో నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5, సోనీ లివ్, హాట్ స్టార్, జియో సినిమా, సన్ నెక్ట్, ఆహా సహా అనేక ఓటీటీలు ఉన్నాయి.

Update: 2024-11-25 21:30 GMT

కరోనా మహమ్మారి వల్ల దేశంలో ఓటీటీలు ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నాయో అందరికీ తెలిసిందే. కొవిడ్ పాండిమిక్ ముందు వరకు చాలా తక్కువ మంది ఆదిరించిన ఓటీటీలు కరోనా టైమ్ లో ఓ రేంజ్ లో క్రేజ్ దక్కించుకున్నాయి. బయటకు వెళ్లేందుకు వీలు కాకపోవడంతో అంతా ఓటీటీల్లోనే సినిమాలు, సిరీస్ లు చూసేశారు.

దీంతో ఓటీటీలు దేశంలో యమా పాపులర్ అయ్యాయి. ఇప్పటికే దేశంలో నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5, సోనీ లివ్, హాట్ స్టార్, జియో సినిమా, సన్ నెక్ట్, ఆహా సహా అనేక ఓటీటీలు ఉన్నాయి. అవన్నీ ప్రైవేట్ ఓటీటీలు కాగా.. ప్రభుత్వ రంగా బ్రాడ్‌ కాస్టర్ దూరదర్శన్ రీసెంట్ గా ఓటీటీ వేవ్స్ ను తీసుకొచ్చింది.

అయితే కొవిడ్ తర్వాత వచ్చిన క్రేజ్ తో ఓటీటీలు.. పెద్ద ఎత్తున సినిమాలు కొనుగోలు చేసి స్ట్రీమింగ్ చేశాయి. కొన్ని ప్రత్యేకంగా నిర్మించాయి. దీంతో మేకర్స్ కూడా ఓటీటీలతో భారీ డీల్స్ కుదుర్చుకుని ఆర్జించారు. కానీ ఇప్పుడు ఓటీటీలు రూట్ ఛేంజ్ చేసేశాయి! రూపొందిన అన్ని సినిమాలను కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపడం లేదు.

అదే సమయంలో ఏటా సినిమాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీంతో ప్రముఖ సహా అన్ని ఓటీటీలు అప్పటిలా పెద్ద మొత్తంలో సినిమాలు కొనడం లేదు. పే పెర్ వ్యూ పద్దతిన చిత్రాలను స్ట్రీమింగ్ చేయడానికే జై కొడుతున్నాయి. దాని వల్ల ఓటీటీ నిర్వాహకులకు ఎలాంటి రిస్క్ ఉండదు. రెస్పాన్స్ రాకపోతే నిర్మాతలకు భారీ నష్టం వస్తుంది.

అందుకే ఓటీటీల నిర్వాహకులు.. వ్యూ పర్ పేమెంట్ ప్రక్రియకే సినిమాల డిజిటల్ హక్కులను తీసుకునేందుకు ఇష్టపడుతున్నాయి. లేకుంటే చిత్రాలను వదిలిపెట్టేస్తున్నాయి. ముందుకు కూడా రావడం లేదు. అలా అన్ని సినిమాలకు కాదు.. బడా హీరోలు నటించిన చిత్రాలకు పెద్ద ఎత్తున పెట్టుబడి పెడుతున్నాయి ఓటీటీలు.

కానీ మీడియం, చిన్న రేంజ్ హీరోలు నటించిన సినిమాల డిజిటల్ హక్కులను పే పెర్ వ్యూ పద్దతిలో మాత్రమే దక్కించుకునేందుకు మొగ్గు చూపిస్తున్నాయి. దీంతో ఓటీటీల నిర్వాహకులు డీల్స్ విషయంలో చాలా తెలివిగా ముందుకు వెళ్తున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో మేకర్స్ జాగ్రత్త పడాలని అవసరం ఉందని చెబుతున్నారు. ఓటీటీ డీల్స్ పై పెద్ద ఎత్తున ఆధారపడకపోవడమే బెటర్ అని సూచిస్తున్నారు.

Tags:    

Similar News