అఫీషియ‌ల్: గేమ్ ఛేంజ‌ర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

ఆర్ఆర్ఆర్ త‌ర్వాత గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో చేసిన సినిమా గేమ్ ఛేంజ‌ర్.

Update: 2025-02-04 09:41 GMT

ఆర్ఆర్ఆర్ త‌ర్వాత గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో చేసిన సినిమా గేమ్ ఛేంజ‌ర్. సంక్రాంతి కానుక‌గా రిలీజైన ఈ సినిమా భారీ అంచ‌నాల‌తో వ‌చ్చి బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. సినిమా బాలేక‌పోయినా మూవీలో రామ్ చ‌ర‌ణ్ న‌ట‌న‌ను అంద‌రూ మెచ్చుకున్నారు. అప్ప‌న్న పాత్ర చ‌ర‌ణ్ కెరీర్లోనే బెస్ట్ అని అంద‌రూ అభిప్రాయ‌ప‌డుతున్నారు.


ఇప్ప‌టికే థియేట్రిక‌ల్ ర‌న్ ను పూర్తి చేసుకున్న గేమ్ ఛేంజ‌ర్ త‌ర్వ‌లోనే ఓటీటీలో సంద‌డి చేయ‌డానికి రెడీ అయిపోయింది. గేమ్ ఛేంజ‌ర్ డిజిట‌ల్ హ‌క్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధ‌ర‌కు సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ప్రైమ్ వీడియో ఈ మేర‌కు గేమ్ ఛేంజ‌ర్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేసింది.

ఫిబ్ర‌వ‌రి 7 నుంచి గేమ్ ఛేంజ‌ర్ తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ భాష‌ల్లో స్ట్రీమింగ్ కానుంద‌ని ప్రైమ్ వీడియో అధికారికంగా ప్ర‌క‌టించింది. మ‌ల‌యాళ, హిందీ భాష‌ల వెర్ష‌న్ ఎప్ప‌టినుంచి స్ట్రీమింగ్ కానుంద‌నే విష‌యంపై క్లారిటీ రావాల్సి ఉంది. సుమారు రూ.400 కోట్ల బ‌డ్జెట్ తో దిల్ రాజు నిర్మించిన గేమ్ ఛేంజ‌ర్ ఆయ‌న‌కు తీవ్ర నష్టాల్ని మిగిల్చింది.

కియారా అద్వానీ, అంజ‌లి హీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమాలో ఎస్‌జె సూర్య విల‌న్ గా న‌టించగా త‌మ‌న్ సంగీతం అందించాడు. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన ఈ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ బాక్సాఫీస్ వ‌ద్ద రూ.180 కోట్ల వ‌సూళ్ల‌తో థియేట్రిక‌ల్ ర‌న్ ను ముగించుకుంది.

ఇదిలా ఉంటే గేమ్ ఛేంజ‌ర్ తో డిజాస్ట‌ర్ అందుకున్న రామ్ చ‌ర‌ణ్ త‌న త‌ర్వాతి సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నాడు. రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొంద‌నున్న ఈ సినిమాలో జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా, ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నాడు. గేమ్ ఛేంజ‌ర్ ఫ్లాప్ అవ‌డంతో మెగా ఫ్యాన్స్ ఆశ‌ల‌న్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నారు.

Tags:    

Similar News