ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 36 ముద్దులిచ్చేశాడు ఆ కుర్రహీరో. అప్పటికే పెళ్లయి భార్య ఉన్నా.. ఇలా తనివి తీరా వేరొక మగువ అదరాల్ని జుర్రేశాడు. ఈ విషయాన్ని ఎలాంటి సిగ్గు మొహమాటం లేకుండా ఒప్పుకుంటోంది ఆ కుర్రతార. అసలింతకీ ఈ సీన్‌లో ఆ మల్లెమొగ్గ ఎవరు? కుర్రహీరో ఎవరు? తెలుసుకోవానుంటే డీటెయిల్స్‌లోకి వెళ్లాల్సిందే.
ప్రస్తుతం కుర్ర దర్శకుడు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో త్రిష ఇలియానా నయనతార అనే ఆసక్తికర టైటిల్‌తో సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ మేనల్లుడు జీ.వీ.ప్రకాష్ హీరో. కుర్రభామ మనీషా యాదవ్, ఆనంది (బస్‌స్టాప్ రక్షిత) నాయికలు. అప్పట్లో షూటింగ్ మొదలైంది. ప్రారంభమే జీవీ, మనీషా జంటపై దర్శకుడు కిస్సింగ్ సీన్ ప్లాన్ చేశాడు. అయితే అప్పటికీ జీవీకి మనీషాతో అంత పరిచయం లేదు. స్నేహం అసలే లేదు. కానీ ఆరంభమే ముద్దు సీన్ అనగానే కాస్తంత (పెళ్లయ్యింది కదా) అనుభవజ్ఞుడైన జీవీ సదరు భామతో ఎలాంటి మొహమాటం లేకుండా సీన్‌లో నటించేశాడు.
అయితే ఇంకా పెళ్లి కాని కుమారి మనీషా మాత్రం కాస్త మొహమాట పడిందిట. దాంతో దర్శకుడు టేకులు, రీటేకులు తీసుకోవాల్సొచ్చింది. అంతేనా ఇంటెన్సిటీ ఉన్న ముద్దు కాబట్టి రకరకాల కోణాల్లో టేకులు తీసుకున్నాడు. అలా 36 సార్లు ముద్దాడేసింది ముద్దుగుమ్మ. అయితే అన్నిసార్లు ముద్దాడినట్టు ఆ క్షణం తెలియదంటూ సిగ్గుల మొగ్గయిపోతోంది మనీషా. బాప్‌రే.. వాటే సీన్ గురూ?