ఓటీటీలో 5 సినిమాలు.. ఆ మూవీ పైనే అందరి ఫోకస్

Update: 2022-11-23 10:34 GMT
సినిమా ధియేటర్స్ కంటే ఇటీవల కాలంలో ఓటీటీ లోనే కొంత డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ అయితే దొరుకుతుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా విభిన్నమైన సినిమాలను ఇష్టపడే వారికి మంచి ఓటీటీ అనేవి ఫ్లాట్ ఫార్మ్ గా నిలుస్తున్నాయి అని చెప్పవచ్చు. అయితే నవంబర్ 24 నుంచి కొన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో విభిన్నమైన సినిమాలు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. ఇక ఏ ప్లాట్ ఫామ్ లో ఏ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది అనే వివరాల్లోకి వెళితే ముందుగా అయితే అందరి ఫోకస్ కాంతారా సినిమా పైనే ఉంది.

ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా థియేటర్లో మంచి ఆక్యూపెన్సిని అందుకుంది. అయితే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ 24వ తేదీ నుంచి కాంతారా సినిమా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇక మరొక ఆసక్తికరమైన బై లాంగ్యువల్ చిత్రం ప్రిన్స్ కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ కావడానికి రెడీ అయింది. జాతి రత్నాలు దర్శకుడు అనుదీప్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో తమిళ టాలెంటెడ్ హీరో శివకార్తికేయన హీరోగా నటించాడు.

బాక్సాఫీస్ వద్ద ప్రిన్స్ అయితే తీవ్ర స్థాయిలో నిరాశపరిచింది. ఇక హాట్ స్టార్ లో నవంబర్ 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. మరి అక్కడ ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.

ఇక నాని వాల్ పోస్టర్ ప్రొడక్షన్లో ఈనెల 25 నుంచి మీట్ క్యూట్ అనే సినిమా రాబోతోంది. నాని సోదరి దీప్తి ఈ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం. ఇక సోనీ లీవ్ లో ఈ సినిమా నవంబర్ 25 నుంచి సందడి చేయబోతోంది.

ఇక వివిధ భాషల్లో కూడా మరికొన్ని ఆసక్తికరమైన సినిమాలు రాబోతున్నాయి. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ నటించిన చుప్ సినిమా 25 నవంబర్ నుంచి జీ 5 లో స్ట్రీమింగ్ కానుంది. దీనిపై కూడా తెలుగు ఆడియెన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఇక తమిళ పడవెట్టు అనే సినిమా నవంబర్ 25 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ గా మంచి గుర్తింపు అందుకున్న ఖాకీ అనే వెబ్ సిరీస్ లోని మరొక చాప్టర్ 25 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. మరి వీటిలో ఎలాంటి కంటెంట్ ను ఆడియన్స్ ఎక్కువ స్థాయిలో ఇష్టపడతారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News