తమిళ సినీ పరిశ్రమకు పెద్ద షాక్ తగిలింది. కోలీవుడ్ కు చెందిన సీనియర్ ప్రొడ్యూసర్ అబావనన్ కు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. అంతే కాదు రూ.2.4 కోట్ల జరిమానా కూడా విధించారు న్యాయమూర్తి. చెన్నైలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది. అబావనన్ ఆర్థిక నేరాలకు పాల్పడటమే ఇందుకు కారణం. అబావనన్ బ్యాంక్ అధికారులతో కుమ్మక్కై చెక్కు వసూళ్ల రాయితీలో అవినీతికి పాల్పడ్డట్లు విచారణలో తేలింది. అబావనన్ తో పాటు ఈ స్కాంలో పాలుపంచుకున్న బ్యాంకు అధికారులకు కూడా శిక్ష పడింది. ఇద్దరు పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన ఇద్దరు అధికారులకు చెరో మూడేళ్లు జైలు శిక్ష, రూ.25లక్షల చొప్పున జరిమానా పడింది.
ఇది దాదాపు 17 ఏళ్లుగా సాగుతున్న కేసు. 1999వ సంవత్సరంలో చెన్నైలోని క్యాథలిక్ రోడ్డులోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఈ చెక్కుల రాయితీ కుంభకోణం బయటపడింది. ఈ వ్యవహారంపై ఆ ఏడాదే చెన్నై సీబీఐ కోర్టులో కేసు నమోదైంది. సుదీర్ఘ విచారణ తర్వాత ఈ కేసులో ఇప్పుడు తీర్పు వెలువరించారు. అబావనన్ ఒకప్పుడు తమిళంలో ఫేమస్ ప్రొడ్యూసర్. ఊమై విళిగల్.. సింధూరపూవె.. కరుప్పు రోజా.. కావ్య తలైవన్.. ఇనైంద కైగళ్ లాంటి పెద్ద సినిమాలు నిర్మించారు. ఇందులో కొన్ని తెలుగులోకి కూడా అనువాదమయ్యాయి.