కథానాయికగా ఎదిగేందుకు కెరీర్ కోసం ప్రేమను ప్రేమికులను వదులుకున్న నేటితరం భామలు ఉన్నారు. కానీ లైఫ్ లో సెటిలయ్యేందుకు పెళ్లితో పరిపూర్ణతను సాధించేందుకు నాటితరం అగ్ర కథానాయికలు తమ కెరీర్ నే త్యాగం చేసారు. ముఖ్యంగా ఎన్.ఆర్.ఐలను వివాహం చేసుకునేందుకు నాటి మేటి నాయికలు ఆసక్తిని కనబరిచేవారు. జుహీ చావ్లా- మాధురి ధీక్షిత్-మీనాక్షి శేషాద్రి సహా ఎందరో సినీకెరీర్ నుండి విరామం తీసుకుని పెళ్లాడిన వారి జాబితాలో ఉన్నారు. ఎన్నారైలతో పెళ్లి ఫిక్స్ చేసుకుని బాలీవుడ్ కెరీర్ కు విరామం తీసుకున్న అందాల నాయికల వివరాల్లోకి వెళితే ఆసక్తికర సంగతులివి.
బాలీవుడ్ నటీమణులకు దేశంలో దేశం వెలుపల కోట్లాది గా (మిలియన్ల మంది) అభిమానుల ఫాలోయింగ్ ఉంటుంది. అయినప్పటికీ తమకు అనువైన యువకుడిని ఎంచుకోవడానికి ముఖ్యంగా దేశం వెలుపల వరులను వెతకడానికి ఇష్టపడతారు. దేశంలో సరిజోడు అనిపించే అందాగాళ్లకు ధనవంతులకు కొరత లేనప్పటికీ కొందరు భామలు తమ హృదయాలను మహాసముద్రాల మీదుగా ప్రయాణించే ఎన్నారై వీరులకు అందించాలని భావిస్తుంటారు. ఎన్నారైలను పెళ్లాడి జీవితంలో సెటిలైన నాయికలు తిరిగి ఇప్పుడు నటనలో పునఃప్రవేశానికి ప్రయత్నించడం ఆసక్తికరం.
#1. ముంతాజ్ - మయూర్ మాధ్వానీ
1974లో US-ఆధారిత NRI వ్యాపారవేత్త మయూర్ మాధ్వానిని వివాహం చేసుకున్నప్పుడు ముంతాజ్ ఒక ట్రెండ్ సెట్టర్ గా మారింది. ఆమె Mr. మాధ్వానిని వివాహం చేసుకున్నప్పుడు కెరీర్ లో ఉన్నత స్థితిలో ఉంది. బంధన్ -సచా ఝూతా- అప్నా దేశ్- ఆప్ కీ కసమ్- రోటీ వంటి చిత్రాలలో ముంతాజ్ తన పాత్రలకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి తర్వాత ముంతాజ్ మళ్లీ సినిమాల్లోకి రాలేదు. నేడు ఆమె ఇద్దరు కుమార్తెలకు తల్లి. ఆమె పెద్ద కుమార్తె నటాషా బాలీవుడ్ నటుడు ఫర్దీన్ ఖాన్ ను వివాహం చేసుకుంది.
#2. మాధురీ దీక్షిత్ - డాక్టర్ శ్రీరామ్ నీనే
మాధురీ దీక్షిత్ 1999లో USకు చెందిన సర్జన్ డాక్టర్ శ్రీరామ్ నీనేతో వివాహం వార్తను ధృవీకరించినప్పుడు ఖచ్చితంగా మిలియన్ల మంది హృదయాలు భగ్గుమన్నాయి. బాలీవుడ్ అందాల నటి పెళ్లితో స్థిరపడాలని నిర్ణయించుకోవడం అభిమానులను నిరాశపరిచింది. లాస్ ఏంజిల్స్ లో సెటిలై చిత్ర పరిశ్రమకు వీడ్కోలు పలికింది మాధురి. అయితే మాధురి ఇప్పుడు బాలీవుడ్ కి తిరిగి వచ్చింది. తాను ఎంచుకునే ప్రాజెక్ట్ ల విషయంలో చాలా ఆసక్తిగా ఉంది. ఇద్దరు కుమారులకు మాధురి తల్లి. సినిమాల కంటే తన కుటుంబానికి పూర్తి ప్రాధాన్యతనిస్తుంది.
#3. జుహీ చావ్లా- జై మెహతా
జూహీ చావ్లా 90లలో తన మనోహరమైన నటనతో చిత్ర పరిశ్రమలో అలరించింది. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోను జూహీ చావ్లా నటించింది. యువసామ్రాట్ నాగార్జున సరసన జూహీ నాయికగా ఆడిపాడింది. తన చిరకాల స్నేహితుడు జై మెహతాతో ఆమె వివాహాన్ని కొంతకాలం రహస్యంగా ఉంచారు. జూహీ 1995లో UK ఆధారిత పారిశ్రామికవేత్త అయిన జైని వివాహం చేసుకున్నారు.
మాజీ మిస్ ఇండియాగా జూహీ అందానికి ఫిదా కానివాళ్లు ఆ రోజుల్లో లేరు. ఒక అందమైన అమ్మాయి - ఒక అందమైన అబ్బాయికి జూహీ తల్లిగా ఉన్నారు. జూహీ ఇప్పటికీ సినిమాల్లో చక్కని అవకాశాలను అందుకుంటోంది. ఇటీవల సన్ ఆఫ్ సర్దార్ - గులాబ్ గ్యాంగ్ వంటి చిత్రాలలో కనిపించింది.
4. మీనాక్షి శేషాద్రి- హరీష్ మైసూర్
తన అద్భుతమైన నటన నృత్య నైపుణ్యంతో చిత్ర పరిశ్రమలో సత్తా చాటింది మీనాక్షి శేషాద్రి. 17 సంవత్సరాల వయస్సులో మిస్ ఇండియా కిరీటం పొందిన అతి పిన్న వయస్కురాలుగాను మీనాక్షి ఒక సంచలనం. అయితే చిత్ర పరిశ్రమ నుండి కొంత విరామం తీసుకుని 1995లో US నుండి పెట్టుబడి బ్యాంకర్ అయిన హరీష్ మైసూర్ ని వివాహం చేసుకుంది.
అందాల నటి పెళ్లి తర్వాత తన స్థావరాన్ని యుఎస్ కి మార్చింది. ఇప్పుడు ఇద్దరు అందమైన పిల్లలకు తల్లి. ఆమె ఇప్పటికీ డ్యాన్స్ పై ఆమెకున్న అభిరుచిని విడిచిపెట్టలేదు. చెరిష్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్యాన్స్ పేరుతో డల్లాస్ లో తన స్వంత పాఠశాలను విజయవంతంగా నడుపుతోంది.
5. శిల్పా శెట్టి - రాజ్ కుంద్రా
పొడుగు కాళ్ల సుందరి శిల్పా శెట్టి 1993లో సూపర్ హిట్ చిత్రం బాజీగర్‌తో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత వరుసగా యావరేజ్ సినిమాలు వచ్చాయి. కానీ శిల్పా 2007లో ప్రసిద్ధ బ్రిటిష్ సెలబ్రిటీ రియాలిటీ షో `బిగ్ బ్రదర్`ను గెలుచుకున్న తర్వాత అందరి దృష్టిని ఆకర్షించింది. షోలో భారీ విజయం తర్వాత శిల్పా తన ప్రిన్స్ మనోహరమైన రాజ్ కుంద్రాను కలుసుకుంది. బ్రిటన్ లో స్థిరపడిన ఒక వ్యాపార వ్యవస్థాపకుడు అతడు. బాంబే డైయింగ్ కర్తగా సుపరిచితం. అతనిని శిల్పాజీ 2009లో వివాహం చేసుకుంది. ఈ జంట 2012లో వియాన్ అనే అందమైన మగబిడ్డకు జన్మనిచ్చింది. శిల్పా ఇప్పుడు సినిమాల నుండి కొంత విరామం తీసుకుంది. కానీ ఇప్పటికీ సినీనిర్మాణం టెలివిజన్ కార్యక్రమాలతో అనుబంధం కలిగి ఉంది. క్రీడారంగంలోను శిల్పాశెట్టి పెట్టుబడులు పెడుతోంది.
6. పూర్ణ- ఆసిఫ్
అల్లరి నరేష్ సరసన సీమ టపాకాయ్ చిత్రంతో కెరీర్ పరంగా కంబ్యాక్ అయిన మలయాళీ బ్యూటీ పూర్ణ (షామ్న కాసిమ్ అసలు పేరు) రియల్ స్టార్ శ్రీహరి సరసన `శ్రీ మహాలక్ష్మి` అనే చిత్రంతో టాలీవుడ్ ఆరంగేట్రం చేసింది. ఎంతో క్యూట్ గా ముద్దుగా బొద్దుగా కనిపించే పూర్ణను జూనియర్ అశిన్ అని కూడా అభిమానులు ప్రేమగా పిలుచుకుంటారు. అవును- అవును2 లాంటి విజయవంతమైన హారర్ థ్రిల్లర్ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ తెలుగు చిత్రసీమలో ఐదారేళ్ల పాటు కెరీర్ పరంగా బాగానే సాగినా ఆ తర్వాత అవకాశాలు తగ్గాయి. కాలక్రమంలో బుల్లితెర రియాలిటీ షోల జడ్జిగాను పూర్ణ పాపులరైంది.
పూర్ణ ఇటీవలే దుబాయ్‌కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త షానుద్ ఆసిఫ్ అలీని పెళ్లాడింది. అంతేకాదు భర్త నుండి దాదాపు 30 కోట్ల విలువైన బహుమతులను పూర్ణ అందుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ స్పెషల్ డే దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త అయిన తన భర్త నుండి ఖరీదైన బహుమతులు అందుకుంది. 25 అక్టోబరు 2022న పూర్ణ స్వయంగా తన ఇన్ స్టా హ్యాండిల్ లో దక్షిణ భారతీయ విధానంలో సాంప్రదాయ వివాహానికి సంబంధించిన ఫోటోలు వీడియోలను అప్ లోడ్ చేసింది. ఆమె భర్త షానిద్ JBS గ్రూప్ ఆఫ్ కంపెనీలకు CEO. వేలకోట్ల సామ్రాజ్యానికి అధిపతి. డార్లింగ్ పూర్ణకు 2700 గ్రాముల బంగారాన్ని హబ్బీ బహుమతిగా ఇచ్చాడు. దీని ధర సుమారు 1.30 కోట్లు. ఇది మాత్రమే కాదు! 25 కోట్ల విలువైన బంగ్లా.. ఖరీదైన కారును ఆమెకు బహుమతిగా ఇచ్చాడు. అన్ని ఆస్తుల విలువ కలిపి 30 కోట్లు ఉంటుందని అంచనా.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.