తెలుగు సినిమా గురించి ప్రస్తుతం దేశం మొత్తం మాట్లాడుకుంటున్నారు అంటే అందుకు కారణం బాహుబలి అనడంలో ఎలాంటి సందేహం లేదు. బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా స్థాయి పెరిగింది.. బాహుబలి సినిమా తర్వాత బాహుబలి సినిమాలకు ఏమాత్రం తెలుగు సినిమాలు తక్కువ కాదు అని తేలిపోయింది. తెలుగు సినిమా అంటే ఉన్న చిన్న చూపు బాహుబలి తో కొట్టుకు పోయింది.
బాహుబలి మొదటి పార్ట్ వచ్చి సరిగ్గా ఏడు సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా ఇంకా కట్టప్ప.. భల్లాలదేవుడు.. బాహుబలి పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. బాహుబలి 1 విడుదల తర్వాత బాహుబలి ని కట్టప్ప ఎందుకు చంపాడు అంటూ జాతీయ స్థాయి.. అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్చ జరిగింది. ఒకానొక సందర్భంలో ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా మాట్లాడుతూ కట్టప్ప.. బాహుబలి గురించి ప్రస్తావించాడు.
దేశవ్యాప్తంగా బాహుబలికి ఉన్న పాపులారిటీ ఏ పాటిదో అందరికి తెల్సిందే. బాహుబలి 2 దాదాపుగా 1800 కోట్ల వసూళ్లు నమోదు చేయడంకు కారణం బాహుబలి 1 వేసిన పునాది. ఏడు సంవత్సరాల క్రితం విడుదల అయిన బాహుబలి 1 సినిమా తో రాజమౌళి ప్రపంచానికి తానేంటో నిరూపించడంతో పాటు తెలుగు సినిమా ను గురించి వెలుగెత్తి చెప్పాడు.
అంతకు ముందు వరకు సౌత్ సినిమాల్లో తమిళ సినిమాలకు కాస్త ఉత్తరాదిన క్రేజ్ ఉండేది. కాని బాహుబలి తర్వాత సౌత్ సినిమాల గురించి ఉత్తర భారతంలో ప్రముఖంగా మాట్లాడుకోవడం జరిగింది. తెలుగు సినిమా స్థాయి ని అమాంతం పెంచేసిన బాహుబలి సినిమా ఆకాశమే హద్దు అన్నట్లుగా క్రేజ్ ను దక్కించుకున్న విషయం తెల్సిందే.
హిందీలో ప్రస్తుతం తెలుగు సినిమాలు ఎక్కువ శాతం ఆడుతున్నాయి అంటే ఖచ్చితంగా కారణం బాహుబలి. అందుకే బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అన్నట్లుగా తెలుగు సినిమా పరిశ్రమ నిలిచింది. బాహుబలి 2 వసూళ్ల రికార్డును ఇప్పటి వరకు మరే సినిమా కూడా బ్రేక్ చేయలేక పోయింది. ఏ స్థాయిలో బాహుబలి ఇండియన్ ప్రేక్షకుల్లోకి దూసుకు వెళ్లింది అనేది దీన్ని బట్టి అర్థం అవుతుంది.