8 పేజీల డైలాగ్స్‌ 8 కెమెరాలు.. వకీల్ సాబ్‌ సింగిల్ టేక్‌

Update: 2021-05-23 06:30 GMT
ఇండస్ట్రీలో హీరోలు వారసత్వంగా వచ్చినా వారు కష్టపడకుండా అభిమానులను తమ ప్రతిభతో సంతృప్తిపర్చకుండా స్టార్స్ అవ్వలేరు. బ్యాక్ గ్రౌండ్ ఉంటే హీరోలుగా మారడం జరుగుతుంది కాని స్టార్స్ అవ్వరు. ప్రస్తుతం టాలీవుడ్‌ లో ఎంతో మంది స్టార్స్ ఉన్నారు. వారిలో పలువురు వారసులు ఉన్నా కూడా కష్టపడి గుర్తింపు దక్కించుకున్న వారే. హీరోలు స్టార్‌ లుగా మారాలంటే అంత ఈజీ కాదు.. వారి కష్టం ప్రతిభ మామూలుది కాదంటూ వకీల్ సాబ్ నటుడు శివ అన్నాడు. పవన్‌ కళ్యాణ్ నటించిన వకీల్‌ సాబ్‌ సినిమాలో కీలక పాత్రలో నటించిన శివ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గొప్పతనంను చెప్పుకొచ్చాడు.

వకీల్ సాబ్‌ కోర్టు సన్నివేశాల చిత్రీకరణ అనుభవాలను శివ గుర్తు చేసుకున్నాడు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కోర్టు సన్నివేశాల్లో నేను 28 రోజులు పాల్గొన్నాను. ఆ సమయంలో హీరో(పవన్‌ కళ్యాణ్‌) గారు ఏ రోజు పడుకోలేదు. మార్నింగ్‌ షూటింగ్‌ పూర్తి చేసుకుని తర్వాత మీటింగ్స్ కు వెళ్లేవారు. మళ్లీ మీటింగ్స్ నుండి నేరుగా షూటింగ్‌ కు వచ్చే వారు. ఆయన ఎక్కడ కూడా పడుకున్నట్లుగా అనిపించేది కాదు. అయినా కూడా చాలా యాక్టివ్‌ గా షూటింగ్ లో డైలాగ్‌ లను చెప్పే వారు.

కోర్టు సన్నివేశంలోని ఆయన ప్రతి డైలాగ్‌ కూడా 8 నుండి 10 పేజీలు ఉండేది. చుట్టు ఎనిమిది కెమెరాల సెటప్‌. సింగిల్ టేక్‌ లో ఎనిమిది పేజీల డైలాగ్‌ ను ఈజీగా చెప్పేవారు. అప్పుడే అనిపించింది స్టార్‌ హీరోలు.. పవర్ స్టార్‌ లు ఈజీగా అవ్వరు. ఇవన్నీ కూడా వింటే కాదు చూస్తే తెలుస్తుందంటూ పవన్ గొప్పతనంను.. ఆయన నటన శైలిని గురించి శివ చెప్పుకొచ్చాడు. పవన్ అతి తక్కువ సమయంలోనే వకీల్‌ సాబ్‌ ను ముగించిన విషయం తెల్సిందే. సింగిల్ టేక్ లో అంత పెద్ద డైలాగ్స్ ను పూర్తి చేయడం అంటే మామూలు విషయం కాదు. అందుకే పవన్‌ పవర్‌ స్టార్‌ అయ్యాడంటూ అభిమానులు అంటున్నారు.





Full ViewFull View
Tags:    

Similar News