మోస్ట్‌ వాంటెడ్‌ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అలర్ట్‌

Update: 2022-01-27 05:30 GMT
ఇండియా లో క్రికెట్ కు ఇంత ఆధరణ ఉంది అంటే అది ఖచ్చితంగా 1983 లో వచ్చిన వరల్డ్ కప్‌ వల్లే అనే విషయం తెల్సిందే. ఏమాత్రం అంచనాలు లేకుండా వరల్డ్ కప్‌ లో ఎంట్రీ ఇచ్చిన టీం ఇండియా వరుస విజయాలతో ఫైనల్‌ కు చేరి అందరిని ఆశ్చర్యపర్చి ఏకంగా వరల్డ్‌ కప్ ను దక్కించుకున్నారు. ఆ అరుదైన అద్బుత మ్యాచ్ ను మరియు సిరీస్ ను అప్పట్లో పెద్దగా టెక్నాలజీ అందుబాటు లో లేకపోవడంతో మ్యాచ్ ను చూసే అవకాశం దక్కలేదు. కాని తాజాగా 83 సినిమా తో ఆ మధుర క్షణాలను క్రికెట్ అభిమానులకు మరియు సినీ అభిమానుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు. ప్రతి ఒక్క ఇండియన్ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా చూడాలనుకునే.. చూస్తున్న సినిమా 83. వందల కోట్లు వసూళ్లు చేస్తుందని ఈ సినిమాపై అంతా నమ్మకం పెట్టుకున్నారు. కాని కరోనా వల్ల సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు దక్కించుకోలేక పోయింది.

థియేటర్లలో ఈ సినిమాను చూడని వారు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం వెయిట్‌ చేస్తున్నారు. క్రిస్మస్ కానుకగా విడుదల అయిన ఈ సినిమాను నాలుగు వారాల్లో ఓటీటీ స్ట్రీమింగ్‌ చేస్తారని అంతా భావించారు. కాని ముందస్తు ఒప్పందం ప్రకారం సినిమా కస్త ఆలస్యంగా సినిమాను స్ట్రీమింగ్‌ చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఏడు వారాల థియేటర్‌ రిలీజ్ తర్వాత మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్ కు అనుమతించారు. ఇక ఈ సినిమా ఓటీటీ లో స్ట్రీమింగ్ కు రంగం సిద్దం అయ్యింది. ఫిబ్రవరి 18వ తారీకున అన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవ్వబోతుంది. అయితే హిందీ వర్షన్‌ ను మాత్రం నెట్‌ ఫ్లిక్స్ వారు భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లుగా సమాచారం  అందుతోంది.

ఇక 83 సినిమా సౌత్‌ భాషల ఓటీటీ రైట్స్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ వారు కొనుగోలు చేయడం జరిగింది. హిందీ మరియు ఇతర సౌత్‌ ఇండియన్ భాషల్లో ఒకే రోజు స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు. రణ్వీర్ సింగ్ మరియు దీపిక పదుకునే ప్రథాన పాత్రల్లో కనిపించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. సినిమా కపిల్ దేవ్‌ యొక్క బయోపిక్ గా రూపొందింది. కపిల్‌ దేవ్ పాత్రలో రణ్వీర్‌ సింగ్ కనిపించాడు. ఆయన భార్య పాత్రలో దీప్తిక పదుకునే నటించింది. ఈ సినిమా స్ట్రీమింగ్ కోసం వెయిట్‌ చేస్తున్న ప్రేక్షకులు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Tags:    

Similar News