90 కీజీల తలపాగాతో డాన్సా..

Update: 2015-08-08 06:24 GMT
సినిమాకి ఏదో ఓ ప్రత్యేకత వుండడం ఆసక్తి కలిగించేదే అయినా మరీ ఇలా నెత్తి మీద 90 కేజీల బరువు పెట్టుకొని చిందేయడం అంటే మాటలా..? కొంతమంది నటీనటులు కొన్ని ప్రత్యేక సినిమాల్లో నాలుగైదు కిలోల బరువున్న కాస్టూమ్స్ వేసుకోడానికే కిందామీద పడుతుంటారు. అలాంటిది ఏకంగా 90 కిలల తలపాగాతో పాటని చిత్రీకరించడం చిత్రమే మరి.       

ప్రభుదేవా దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన సింగ్ ఈజ్ బ్లింగ్ సినిమా లో టంగ్ టంగ్ భజే అనే పాట కోసం 90 కేజీల తలపాగా వాడారట. పంజాబ్ గ్రామీణ ప్రాంతాలలో అక్కడి ప్రముఖ భాంగ్రా, గిడ్డా కళాకారులతో ఈ పాటను తెరకెక్కించారు. ఈ సినిమాలో ఇదో ప్రత్యేక అంశంగా భావించిన చిత్ర బృందం దీనిని ప్రచార కార్యక్రమాల్లో ఉపయోగించుకోవాలని ట్రైలర్ కంటే ముందే విడుదల చేస్తున్నారు. ఈ నెల 14 విడుదల కానున్న బ్రదర్స్ సినిమా విరామ సమయంలో ఈ పాటని ప్రదర్శిస్తారట.      
Tags:    

Similar News