బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్, దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీపై కేసు నమోదైంది. వీరి కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం తమ కుటుంబ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తోందని ఓ వ్యక్తి కోర్టుకెక్కారు. దీంతో.. కోర్టు షోకాజ్ నోటీసులు జారీచేసింది.
సంజయ్ బన్సాలీ ‘గంగూబాయ్ కతియావాడి’ పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ముంబై మాఫియా రారాణి ‘గంగూబాయి’ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్ర కథ మొత్తం ముంబై రెడ్ లైట్ ప్రాంతంతో పాటు కామాటిపుర చుట్టూ తిరగనుంది. దీంతో.. గంగూబాయి కతియావాడి కుమారుడు బాబూజీ రాజీ షా కోర్టుకెక్కారు.
అలియా, సంజయ్‌తో పాటు 'ద మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై' పుస్తకాన్ని రాసిన హుస్సేన్ జైదీపై, ఈ సినిమాకు సహకరించిన రిపోర్టర్ జేన్ బోర్గ్స్ పై బాంబే సివిల్ కోర్టులో కేసు దాఖలు చేశారు రాజీ షా. ‘ద మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ పుస్తకం తమ ఆత్మ గౌరవాన్ని, స్వేచ్ఛను దెబ్బ తీయడంతో పాటు పరువుకు భంగం కలిగిస్తోందని పేర్కొన్నారు. ఈ పుస్తక ప్రచురణలను నిలిపివేయడంతో పాటు దీని ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాను సైతం ఆపేయాలని కోరారు.
ఈ విషయంపై బాధితుడు బాబూజీ రాజీ షా తరపు న్యాయవాది నరేంద్ర దూబే మాట్లాడుతూ.. 'ఈ సినిమా ప్రోమో రిలీజైనప్పటి నుంచీ రాజీ షా, అతడి కుటుంబంపై వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. అతడు ఉంటున్న ప్రదేశంలో సైతం వేధింపులకు గురవుతున్నాడు. ఈ క్రమంలో అతడిపై దాడి జరగ్గా.. కాలు విరిగింది. మరోవైపు వేశ్య కుటుంబం అంటూ షా, అతడి బంధువులను ఎగతాళి చేస్తున్నారు' అని పేర్కొన్నారు.
సినిమాలో గుంగూబాయిని అసభ్యంగా చిత్రీకరించినందుకు పరువు నష్టం దావా వేసేందుకు కూడా వెనకాడబోమని ఆయన హెచ్చరించారు. కాగా.. దీనిపై స్పందించాలని కోర్టు చిత్ర యూనిట్ కు సమన్లు పంపింది. జనవరి ఏడు వరకు గడువునిచ్చింది.