ప్రభాస్ హీరోగా తెరకెక్కిన 'సాహో' మూవీ థియేట్రికల్ రన్ ఎప్పుడో ముగిసింది. అక్టోబర్ 23 న డార్లింగ్ పుట్టిన రోజు కావడంతో తన కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందేమోననే ఊహాగానాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే 'సాహో' కు సంబంధించిన మరో న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.
కార్పోరేట్ బ్రాండ్స్ పెద్ద స్టార్ హీరోల సినిమాలతో జట్టుకట్టడం సాధారణమైన విషయం. సినిమాలో తమ బ్రాండ్ కు ప్రచారం కల్పించేందుకు వారు నిర్మాతలకు వారు డబ్బు చెల్లిస్తారు. అలానే 'సాహో' మేకర్స్ తో కూడా ఒక ఆర్కిటిక్ ఫాక్స్ అనే బ్యాగ్ కంపెనీ వారు ప్రమోషన్ విషయంలో రూ.1.40 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారట. అయితే 'సాహో' ఫైనల్ కాపీ లో మాత్రం తమ బ్రాండ్ ఎక్కడా కనిపించకపోవడంతో సదరు బ్యాగ్ కంపెనీ వారు నిర్మాతలపై చీటింగ్ కేసు నమోదు చేశారట.
అక్టోబర్ 17 వ తారీఖున హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీసు స్టేషన్ లో 'సాహో' మేకర్స్ పై బ్యాగ్ కంపెనీవారు కేసు పెట్టారని సమాచారం. డబ్బు తీసుకుని కూడా తమ ఒప్పందాన్ని 'సాహో' నిర్మాతలు అతిక్రమించారని తమకు న్యాయం చేయాలని వారు పోలీసులు కోరారు. మరి ఈ విషయంలో 'సాహో' నిర్మాతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.