కొత్త ఏటీటీ 'ఫ్రైడే మూవీస్' ప్రత్యేకతలివే..!

Update: 2020-12-09 12:46 GMT
కోవిడ్-19 పరిస్థితుల్లో డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ హవా స్టార్ట్ అయింది. అప్పటికే ఉన్న ప్రముఖ ఓటీటీలతో పాటు కొత్తగా మరికొన్ని ఓటీటీలు - ఏటీటీలు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చాయి. సినిమాలు వెబ్ సిరీస్ లతో పాటు కొత్త మూవీస్ ని డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదల చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా 'ఫ్రైడే మూవీస్' అనే మరో కొత్త డిజిటల్ వేదిక వీక్షకులకు అందుబాటులోకి వస్తోంది. ఫ్రైడే మూవీస్ యాప్ లో ప్రత్యేకమైన సినిమాలు, ఇండిపెండెంట్ ఫిలిమ్స్ మరియు షార్ట్ ఫిలిమ్స్ పే పర్ వ్యూ పద్ధతిలో అందుబాటులో ఉంటాయి. టాప్ బ్యాండ్ విడ్త్ తో హై క్వాలిటీ వీడియోతో అన్ని రకాల డివైస్ లలో ఎనీ టైం థియేటర్ అనుభూతిని పొందవచ్చని నిర్వహకులు చెబుతున్నారు.

ఫ్రైడే మూవీస్ ఏటీటీ కి స్క్రిప్షన్స్ మరియు మెంబర్ షిప్ అవసరం లేదు. వీక్షకులు తమకు నచ్చిన సినిమాలను ఎంచుకుని డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఎంచుకున్న కంటెంట్ ని మొబైల్, కంప్యూటర్, టీవీ, టాబ్లెట్ మొదలైన వాటిలో చూడొచ్చు. 24 గంటల్లో నచ్చిన సినిమాను ఎన్నిసార్లు అయినా పాస్ చేసుకుని చూడొచ్చు. అలానే మెసేజ్ తో వేరే వాళ్లకు సినిమాని సజెస్ట్ చేయొచ్చు. అంతేకాకుండా సినీ స్టార్స్ తో టాక్ షో లతో పాటు లక్కీ డ్రాలు, ఆఫర్స్ అందించనున్నారు. దీని కోసం ప్లే స్టోర్ నుంచి ఫ్రైడే మూవీస్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని సైనప్ అవ్వాల్సి ఉంటుంది. 'ఫ్రైడే మూవీస్' యాప్ లో డిసెంబర్ 18న ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు దర్శకత్వం వహించిన 'డర్టీ హరి' చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.




Tags:    

Similar News