ప్రముఖ కమెడియన్ కు రూ.5.5 కోట్ల టోకరా

Update: 2021-01-07 15:19 GMT
బాలీవుడ్ ప్రముఖ కమెడియన్, హోస్ట్ అయిన కపిల్ శర్మకు షాక్ తగిలింది. ఆయన ఏకంగా 5.5 కోట్లు మోసపోయారు. ఓ వ్యక్తి డబ్బులు తీసుకొని కపిల్ శర్మను చీట్ చేశాడట.. ఈ మేరకు కపిల్ శర్మ తాజాగా ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కపిల్ శర్మ ఒక వానిటీ కారు తయారీ కోసం ఇటీవల కార్ల డిజైనర్ దిలీప్ చాబ్రియాను కలిశాడు. తనకు ఒక సొంత వానిటీ కారు కావాలని చెప్పాడు. ఇందుకోసం ఏకంగా రూ.5.5 కోట్ల రూపాయలు చెల్లించాడు.

అయితే డబ్బులు తీసుకున్న దిలీప్ ఆ వానిటీ కారును తయారు చేసి ఇవ్వకపోగా ఆ డబ్బులను ఇవ్వకుండా ఎగ్గొట్టాడు. ఈ నేపథ్యంలో కపిల్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దిలీప్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. కపిల్ శర్మ వాంగ్మూలాన్ని పోలీసులు ఈరోజు నమోదు చేశారు.


Tags:    

Similar News