50 వ‌య‌సులో సుస్మితా సేన్ పెళ్లి?

మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ (49) పెళ్లికి సిద్ధంగా ఉన్నా కానీ.. అలాంటి నిబద్ధతకు నిజంగా అర్హుడైన భాగస్వామి అవసరమని తాను నమ్ముతున్నానని వ్యాఖ్యానించింది.

Update: 2025-02-25 17:30 GMT

మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ (49) పెళ్లికి సిద్ధంగా ఉన్నా కానీ.. అలాంటి నిబద్ధతకు నిజంగా అర్హుడైన భాగస్వామి అవసరమని తాను నమ్ముతున్నానని వ్యాఖ్యానించింది. ఒక అభిమాని తన పెళ్లి ప్రణాళికల గురించి ప్ర‌శ్నించ‌గా.. తాను కూడా వివాహం చేసుకోవాలనుకుంటున్నానని, కానీ సరైన వ్యక్తిని కనుగొనాల్సి ఉంద‌ని సుష్ చెప్పింది. పెళ్లి అనేది యాధృచ్ఛికంగా జరిగే విషయం కాదని.. దానిని లోతైన భావోద్వేగ సంబంధంగా నిర్మించాలని నమ్ముతున్నాన‌ని తెలిపింది. హృద‌యం స్వీక‌రిస్తేనే పెళ్లి అని కూడా వ్యాఖ్యానించింది.

బ్లాక్ టీష‌ర్ట్ ధ‌రించిన సుష్ ప్ర‌త్యేక వేష‌ధార‌ణ‌లో క‌నిపించిన ఓ వీడియోను ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ కొంతమంది సూపర్ స్పెషల్ వ్యక్తులతో ఒక ప్రత్యేక లైవ్ సెష‌న్ లో పాల్గొంటున్నాన‌ని తెలిపారు. లైవ్ లో సుస్మితా సేన్ అభిమానుల‌తో సంభాషించారు. సోష‌ల్ మీడియాల్లో అభిమానులు సుష్ ఆనందంగా ఉండాల‌ని కోరుకున్నారు. దేవుని ఆశీర్వాదం బ‌లం, ఆనందం ఎప్పుడూ మీతో ఉండాల‌ని కొంద‌రు అభిమానులు ఆకాంక్షించారు.

సుస్మితాసేన్ పెళ్లి విష‌యంలో స్ప‌ష్ఠంగానే ఉంది. 50 వ‌య‌సుకు చేరువ‌లో ఈ కోరిక మ‌రింత బ‌లంగానే ఉంది. కానీ స‌రైన వాడు ల‌భించ‌లేద‌నే ఆవేద‌న స్ప‌ష్ఠ‌మ‌వుతోంది. సుష్మితా సేన్ వ్యక్తిగత జీవితం గురించి త‌రచి చూస్తే.. ఇటీవలి వ్యాపారవేత్త, ఐపీఎల్ ఫౌండ‌ర్ లలిత్ మోడీతో డేటింగ్ ప్రారంభించి కొన్ని నెల‌ల్లోనే అత‌డికి బ్రేక‌ప్ చెప్ప‌డం సంచ‌ల‌న‌మైంది. 2022లో మోడీ సోషల్ మీడియా ద్వారా త‌మ‌ సంబంధాన్ని ధృవీకరించారు. మాల్దీవులు-సార్డినియా వంటి దీవుల నుంచి ఫోటోల‌ను పంపించి ప్ర‌కంప‌న‌ల‌కు తెర తీసారు. కొన్ని నెల‌ల త‌ర్వాత‌ మోడీ తన బయో నుండి సేన్ పేరును తొలగించి, తన ప్రొఫైల్ ఫోటోని మార్చుకున్నాక బ్రేకప్ ఖ‌రారైంది.

మోడీతో డేటింగ్ చేయడానికి ముందు మోడల్ రోహ్మాన్ షాల్‌తో సుస్మితా సేన్ దీర్ఘకాలిక సంబంధంలో ఉన్నారు. డిసెంబర్ 2022లో విడిపోయే ముందు ఇద్దరూ దాదాపు నాలుగు సంవత్సరాలు కలిసి ఉన్నారు. ఆ ఇద్ద‌రూ విడిపోయినా.. స్నేహ సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. సుస్మితా సేన్ టాలీవుడ్ లో రక్ష‌కుడు అనే చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. కింగ్ నాగార్జున ఈ చిత్రంలో క‌థానాయ‌కుడిగా న‌టించారు.

Tags:    

Similar News