సిరివెన్నెల పాటపై స‌రికొత్త చ‌ర్చ‌!

Update: 2022-07-19 02:30 GMT
దివంగ‌త లెజెండ‌రీ గేయ‌ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి అనారోగ్య కార‌ణాల వ‌ల్ల చ‌నిపోయిన విష‌యం తెలిసిందే. తెలుగు సినిమాల్లో త‌న‌దైన మార్కు పాట‌ల‌తో వెన్నెల కురిపించారు. ప్రేమలోని గొప్ప‌ద‌నాన్ని, ప్రియురాలి సాన్నిహిత్యాన్ని తెలిపే పాట‌లే కాకుండా స‌మాజాన్ని నిగ్గ‌దీసి అడిగే అర్థ‌వంత‌మైన పాట‌ల్ని అందించిన ర‌చ‌యిత‌గా గొప్ప పేరు ప్ర‌ఖ్యాతులు పొందారు. అయితే ఆయ‌న చివ‌రి పాట ఏదీ? .. ఎవ‌రికి రాశార‌న్న‌ది ఇప్ప‌డు చ‌ర్చ నీయాంశంగా మారింది.

గంతంలో గాణ గంధ‌ర్వుడు ఎస్‌.పి. బాల‌సుబ్ర‌హ్మ‌ణం చ‌నిపోయిన త‌రువాత కూడా ఇలాంటి చ‌ర్చే జ‌రిగింది. బాలుగారు పాడిన పాట ఇదే.. మా సినిమాలో చివ‌రి పాట పాడారంటే లేదు లేదు మా సినిమాలో ప‌డిందే చివ‌రి పాట అంటూ ఆయ‌న చివ‌రి పాట‌ని క్యాష్ చేసుకోవాల‌ని చూశారు. అలాంటి చ‌ర్చే ఇప్పుడు లెజెండ‌రీ గేయ ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి `చివ‌రి పాట‌`పై జ‌రుగుతోంది.

సిరివెన్నెల రాసిన చివ‌రి పాట ఇదే అంటూ గ‌త కొన్ని రోజులుగా చాలా మంది దర్శ‌క నిర్మాత‌లు చాలా పాట‌ల‌ని తెర‌పైకి తీసుకొస్తున్నారు. క‌రోనా కార‌ణంగా చాలా వ‌ర‌కు సినిమాలు పూర్తి కాక‌పోవ‌డం.. అవి ఇప్ప‌టికి పూర్త‌యి రిలీజ్ అవుతుండ‌టంతో ఒక్క సినిమా కు సంబంధించిన వారు ఇది చివ‌రి పాట అంటే ఇది చివ‌రి పాట అంటూ చ‌ర్చ‌కు తెర‌లేపారు. క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ రూపొందిస్తున్న `రంగ‌ మార్తాండ‌` మూవీకి సిరివెన్నెల ఓ పాట రాశారు.

ఇదే స‌మ‌యంలో దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టించిన `సీతారామం` మూవీలోనూ ఓ పాట రాశారు. అయితే ఈ రెండు సినిమాల వారు ఈ పాట‌ల‌ని సీతారామ శాస్త్రి రాసిన చివ‌రి పాట మాదే అని చెప్పుకోవ‌డం లేదు.

కార‌ణం ఏంటా అని ఆరాతీస్తే ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఒక‌టి తెలిసింది. సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి అనారోగ్యంతో హాస్పిట‌ల్ లో వున్న స‌మ‌యంలో ఆయ‌న త‌న అర్థాంగి కోసం ఓ పాట రాయాల‌ని స్టార్ట్ చేశార‌ట‌.

అయితే ఆ పాట ప‌ల్లవిని మాత్ర‌మే రాశార‌ట‌. ఆ త‌రువాత ఆయ‌న చ‌నిపోయిన విష‌యం తెలిసిందే. ఇదే ఆయ‌న చివ‌రి పాట అని, అలా చెప్పుకునే హ‌క్కు, అర్హ‌త సిరివెన్నెల భార్య‌కు మాత్ర‌మే వుంద‌ని తెలిసింది.
Tags:    

Similar News