మెగాస్టార్‌ అభిమానులకు కొత్త ఎక్స్‌ పీరియన్స్‌

Update: 2022-09-27 15:30 GMT
మెగాస్టార్‌ చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి నాలుగు దశాబ్దాలకు పైగానే అయ్యింది. ఇన్ని సంవత్సరాల్లో ఆయన చేసిన దాదాపు అన్ని సినిమాల్లో కూడా హీరోయిన్‌ ఉండటం... రొమాంటిక్ సాంగ్స్ ఉండట... రొమాంటిక్ సీన్స్ ఉండటం అభిమానులు చూస్తూ వచ్చారు.. ఆ మధ్య వచ్చిన సైరా లో కూడా చిరంజీవి డ్యూయెట్స్ ఉన్నాయి. అంతకు ముందు సినిమాల్లో కూడా చిరంజీవి రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయి.

రొమాంటిక్ సన్నివేశాలు.. డ్యూయెట్స్ లేకుండా చిరంజీవి సినిమా మొదటి సారి రాబోతుంది.. అదే గాడ్‌ ఫాదర్‌. మలయాళ సూపర్ స్టార్ నటించిన లూసీఫర్ సినిమాను చిరంజీవి రీమేక్‌ చేయబోతున్నాడు అనే ప్రకటన వచ్చిన వెంటనే లూసీఫర్‌ లో రొమాంటిక్ సన్నివేశాలు.. డ్యూయెట్స్ ను చిరంజీవి కోసం పెడతారని అంతా భావించారు. కమర్షియల్‌ ఎలిమెంట్స్ పేరుతో లూసీఫర్‌ సోల్‌ మిస్ చేస్తారేమో అంటూ కామెంట్స్ వచ్చాయి.

మెగాస్టార్‌ చిరంజీవి గాడ్‌ ఫాదర్‌ సినిమాలో అలాంటి కమర్షియల్‌ హంగులకు వెళ్లలేదట. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగానే మార్చారు తప్ప లూసీఫర్ సోల్‌ మిస్ అయ్యే విధంగా కమర్షియల్‌ ఎలిమెంట్స్ ను జొప్పించలేదని చిత్ర యూనిట్‌ సభ్యులు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

ఇప్పటి వరకు చిరంజీవి సినిమాలు చూసిన వారికి గాడ్‌ ఫాదర్‌ సినిమా కచ్చితంగా కొత్త ఎక్స్‌ పీరియన్స్ ను అందిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం గాడ్‌ ఫాదర్‌ గురించి మెగా అభిమానుల్లో విపరీతమైన చర్చ జరగుతోంది.

ముఖ్యంగా చిరంజీవి లుక్‌.. కాస్త ఏజ్‌ గా.. గ్రే హెయిర్‌ తో చిరంజీవిని మొదటి సారి వెండి తెరపై చూడబోతున్నందుకు అభిమానులు చాలా ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 5న ఈ సినిమా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News