#సుశాంత్‌.. నా హృదయంలో ఒక ముక్క నీతోనే!‌- కృతి

Update: 2020-06-17 04:30 GMT
యువ‌హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆక‌స్మిక మ‌ర‌ణం స్నేహితులు.. మిత్రులు జీర్ణించుకోలేనిది. న‌వంబ‌ర్ లో పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్న ప్రియురాలు రియా చ‌క్ర‌వ‌ర్తికి ఇది ఊహించ‌ని షాక్ అనే చెప్పాలి. అది కేవ‌లం ఒక ప్రేయ‌సికి మాత్ర‌మే కాదు.. అత‌డి మాజీ ప్రేయ‌సి కృతి స‌నోన్ కి బిగ్ షాక్.

ప‌రిశ్ర‌మ‌లో ఎవ‌రూ గొప్ప స్నేహితులు లేక‌పోయినా అత‌డిని అభిమానించే వాళ్లు.. ప్రేమించేవాళ్లు ఉన్నార‌ని సంతాప సందేశాల‌తో అర్థ‌మైంది. ఉన్న‌న్నాళ్లు ఒంట‌రి అయ్యాడు కానీ.. ప‌రిశ్ర‌మ స్నేహాల‌కు దూరంగా ఉన్నాడు కానీ.. అత‌డిపై ప‌రిశ్ర‌మ వ్య‌క్తుల‌కు ఎన‌లేని ప్రేమ ఉంద‌ని కొన్ని సందేశాలు స్ప‌ష్ఠం చేశాయి. తాజాగా సుశాంత్ సింగ్ మాజీ ప్రేయ‌సి కృతి సనోన్ స్పంద‌న గుండెను తాకింది.

నా హృద‌యంలో ఒక భాగం నీతోనే ఉంది! అంటూ కృతి చేసిన ట్వీట్ వైర‌ల్ గా మారింది. ``సుష్ .. మీ తెలివైన మనస్సు మీ బెస్ట్ ఫ్రెండ్ .. అదే మీకు చెత్త శత్రువు అని నాకు తెలుసు .. బ‌త‌క‌డం కంటే చావ‌డం చాలా సులువు అని మంచిద‌ని అనిపించింది. కానీ మీ జీవితంలో మీకు ఒక క్షణం ఉందని తెలుసుకోక‌పోవడం నా మ‌న‌సును ముక్క‌లు చేసింది. ఆ క్షణం నీతో గడిపేందుకు మీ చుట్టూ జ‌నం ఉండాలని నేను కోరుకుంటున్నాను. మిమ్మ‌ల్ని ప్రేమిస్తున్న వారిని మీరు దూరం పెట్ట‌లేద‌ని న‌మ్ముతున్నా. మీ లోపల విరిగిపోయినది నాకు తెలుసు. నా హృదయంలో ఒక భాగం మీతోనే వెళ్లిపోయింది. ఒక భాగం మిమ్మల్ని ఎల్లప్పుడూ సజీవంగా ఉంచుతుంది`` అని భావోద్వేగ పూరితంగా స్పందించింది కృతి. మీ సంతోషం కోసం ఎప్ప‌టికీ ప్రార్థ‌న‌ను ఆప‌ను! అని తెలిపింది.
Tags:    

Similar News