దేశ శ్యాప్తంగా కోవిడ్ కలకలం సృష్టిస్తుంటే యావద్భారతానికి నేనున్నానంటూ ముందుకొచ్చాడు రియల్ హీరో సోను సూద్. ఎక్కడ ఆపద అంటే అక్కడ తన చేయి అందించి నేషనల్ వైడ్‌గా హాట్ టాపిక్ గా మారాడు. ఏంటీ ఇతని ధైర్యం?.. ఎక్కడిది ఇంత డబ్బు? .. అంటూ చాలా మంది సోను సూద్ ఆర్థిక మూలాలపై ఆరాలు తీయడం.. కొంత మంది విమర్శలకు దిగడం చేశారు. అయినా వాటన్నింటినీ చిరునవ్వుతో స్వీకరించాడు సోను సూద్.
ఇదిలా వుంటే అతని ఇళ్లతో పాటు ఆఫీసులపై గత నాలుగు రోజులుగా ఐటీ దాడులు జరిగాయి. ఇందులో సోను సూద్ కోట్ల రూపాయలు ఐటీ ఎగవేశాడంటూ ఐటీ శాఖ ప్రకటించడం సంచలనంగా మారింది. ఈ విషయంలో సోనూకి ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ అండగా నిలిచారు. తన చుట్టూ జరుగుతున్న పరిణామాలపై సోను సూద్ ఘాటుగా స్పందించారు. విజయమేదైనా తాను సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదని, ..కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందని ట్వీట్ చేశారు.
తాజాగా ఇదే విషయమై తనని కలిసిన నేషనల్ మీడియాకు పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు సోనూ. ఐటీ రైడ్స్ తో పాటు ఇతర ఫైనాన్షియల్ ఎలిగేషన్స్ గురించి అడిగితే నాపై జరిగిన `జబర్దస్తీ` అని సమాధానం చెప్పారు. అంతే కాకుండా తాను డబ్బుని ఎక్కడా దుర్వినియోగం చేయలేదని స్పష్టం చేశాడు. ప్రతీ ఒక్కరికీ తెలుసు ఏం జరుగుతోందో.. నువ్వు ఏదైనా భిన్నంగా చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ప్రతిబంధకాలు ఎదురవుతాయని వాటిని నువ్వు ఎదుర్కోవాలన్నదాన్ని నేను బలంగా విశ్వసిస్తాను.
అంతే కాకుండా నేను ప్రచార కర్తగా వ్యవహరించినందుకు గాను వచ్చే పారితోషికాన్ని మానవసేవ కోసం వినియోగంచాలని ఇప్పటికే ఎన్నో సందార్భాల్లో ఆయా బ్రాండ్ సంస్థలకు సూచించాను. అలా మా ప్రయాణం కొనసాగుతోంది. విరాళాల ద్వారా సేకరించిన 18.94 కోట్లలో కేవలం 1.9 కోట్లని మాత్రమే ఖర్చు చేశారు. మిగతావి ఎక్కడ? అని అడిగిన ప్రశ్నకు సోనూ అదిరిపోయే సమాధానం చెప్పాడు. మిగతా మొత్తాన్ని వినియోగించలేదన్నది అబద్దం. మేము ప్రతీ రోజూ ఉపయోగిస్తున్నాము. డబ్బులు ఆసుపత్రులు మరియు విద్యా సంస్థలకు బదిలీ చేయబడుతున్నాయి అని సమాధానం చెప్పారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ `మేము ప్రాణాలను కాపాడటానికి ఉపయోగిస్తాము. మేము విరాళాలు సేకరించడం మొదలుపెట్టి కేవలం నాలుగు నుంచి ఐదు నెలలు మాత్రమే అయింది. నా వద్దకు వస్తున్న ప్రతీ అభ్యర్థనకు స్పందించి డబ్బును ఉపయోగించి వుంటే ఆ డబ్బును ఖాలీ చేయడానికి 18 గంటలు కూడా పట్టదు. మాకు అభ్యర్థిన వచ్చినప్పుడల్లా మేము నిశితంగా పరిశీలిస్తాము అది నిజమైన అవసరం ఉన్న వ్యక్తికి వెళ్లేలా చూసుకుంటాం. ఒక అంథురాలు తనకు లభించే పెన్షన్ నుండి ₹ 15,000 విరాళంగా ఇచ్చింది. ఆమెకు 18 కోట్ల లెక్కలు తెలుసు. పిల్లల పిగ్గీ బ్యాంకుల నుండి వచ్చిన ప్రతి ఒక్క పైసాని కూడా తెలివిగా ఉపయోగించబడాలని నేను నిర్ధారించుకొన్నాను. సహాయం అన్న సరైన వ్యక్తి ఖర్చు చేయాలన్నదే మా ప్రయత్నం. నేను హాస్పిటల్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాను . ఇందు కోసం ఇప్పటికే తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాలలోని మంత్రులను కలుసుకున్నాను. దేశవ్యాప్తంగా ఉన్న స్టార్ హాస్పిటల్స్ యాజమాన్యాలతో మాట్లాడాను. నా కలలు పెద్దవి కాబట్టి సోనూసూద్ లేకపోయినా మేం ఉంటాం అని ప్రజలు ముందుకొచ్చారు. నేను డబ్బు ఖర్చు చేయలేదని ప్రజలు అంటున్నారు. కానీ నేను డబ్బును ఎక్కడా వృధా చేయలేదు` అని సోనూ చెప్పుకొచ్చారు.