#SoChay పెళ్లి స్ట్రీమింగ్ కోసం OTT బిగ్ డీల్?
నాగచైతన్య- శోభిత ధూళిపాళ జంట వివాహం డిసెంబర్ 4న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగనుంది.
నాగచైతన్య- శోభిత ధూళిపాళ జంట వివాహం డిసెంబర్ 4న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగనుంది. దీనికి సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారని సమాచారం.
తాజా కథనాల ప్రకారం..ఈ హై ప్రొఫైల్ వివాహాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం చేయవచ్చని మీడియాలో కథనాలొస్తున్నాయి. స్ట్రీమింగ్ హక్కుల కోసం నెట్ ఫ్లిక్స్ రూ.40 కోట్ల వరకూ చెల్లిస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నాగార్జునతో పలు OTT లు చర్చలు జరుపుతున్నాయని, అంతిమంగా నెట్ ఫ్లిక్స్ కి ఫైనల్ అయ్యే అవకాశం ఉందని కథనాలొస్తున్నారు.
ఒకవేళ ఇది నిజమైతే.. #శో-చై జంట పెళ్లి కూడా నయనతార - విఘ్నేష్ శివన్ తరహాలో నెట్ ఫ్లిక్స్ లో వీక్షించే వీలుంటుంది. `నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్` (నయన్-విఘ్నేష్ పెళ్లి పై డాక్యు సిరీస్) విడుదలైన తర్వాత చైతన్య -శోభిత వివాహం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రదర్శనకు వస్తున్న రెండవ సెలబ్రిటీ వివాహం అవుతుంది.
దీనిని బట్టి చై-శోభిత జంట పెళ్లికి పెద్ద స్థాయిలో పేరున్న అతిథులు అటెండవుతున్నారని అర్థం చేసుకోవచ్చు. మెగా, అల్లు, నందమూరి కుటుంబాలకు ఆహ్వానాలు పంపారని సమాచారం. సినీపరిశ్రమ దిగ్గజాలందరికీ ఆహ్వానం ఉంటుందని భావిస్తున్నారు.
నాగచైతన్య తనకు కాబోయే భార్య శోభితను వీలున్న ప్రతి వేదికపైనా హైలైట్ చేస్తున్నారు. శోభిత తనను బాగా అర్థం చేసుకుంటోందని .. తనతో లోతుగా కనెక్ట్ అయ్యానని చై ఆనందంగా చెబుతున్నాడు. ఆమె నన్ను అందంగా అర్థం చేసుకుంటుంది... నాలో శూన్యతను తరిమేస్తోంది! అని ఎమోషనల్ అయ్యాడు. మున్ముందు ఇది అద్భుతమైన ప్రయాణం అవుతుందని ఆనందం వ్యక్తం చేసాడు. ఇప్పటికే ఇరు కుటుంబాల్లో ప్రీవెడ్డింగ్ వేడుకలు మొదలయ్యాయి. పెళ్లి శుభలేఖలు పంచుతున్నారు.