సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ రిలీజ్‌పై లేటెస్ట్ అప్డేట్
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా అందరి అంచనాలను మించి భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా అందరి అంచనాలను మించి భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ జనవరి 14న సంక్రాంతి కానుకగా రిలీజై మంచి కలెక్షన్లను రాబట్టింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడంతో పాటూ లాంగ్ రన్ ను దక్కించుకుంది.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న టైమ్ లో ఈ సినిమా డిజిటల్ లో కంటే ముందుగా శాటిలైట్ లోకే రానుందని చెప్పి జీ తెలుగు యాజమాన్యం అందరికీ పెద్ద షాకే ఇచ్చింది. సంక్రాంతికి వస్తున్నం సినిమా జీ5లో కంటే ముందుగానే జీ తెలుగులోనే వస్తుందని అనౌన్స్ చేశారు.
సంక్రాంతికి వస్తున్నాం డిజిటల్ రైట్స్ ను జీ5 సొంతం చేసుకుంటే, శాటిలైట్ హక్కులను జీ తెలుగు సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ స్ట్రీమింగ్ పై తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది. టీవీలో టెలికాస్ట్ అయిన రెండు రోజులకే ఈ సినిమాను డిజిటల్ లో స్ట్రీమింగ్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే ఈ సినిమా టెలికాస్ట్ ఎప్పుడనే విషయాన్ని జీ తెలుగు ఇంకా రివీల్ చేయలేదు. త్వరలో అంటున్నారు తప్పించి డేట్ మాత్రం ఇంకా చెప్పలేదు. శివరాత్రి సందర్భంగా సంక్రాంతికి వస్తున్నాంను టెలికాస్ట్ చేసే ఛాన్సుంది. అయితే టెలికాస్ట్ ఎప్పుడైనా, ఆ తర్వాత రెండ్రోజుల్లో జీ5లో సంక్రాంతికి వస్తున్నాం స్ట్రీమింగ్ కు రానుందని తాజాగా సమాచారం అందుతుంది.
ప్రాంతీయ చిత్రంగా తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా రూ.300 కోట్ల గ్రాస్ వసూలు చేసి టాలీవుడ్ రీజనల్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్లతో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. వెంకటేష్ కెరీర్లో కూడా ఇదే బిగ్గెస్ట్ హిట్. ఈ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరి కెరీర్ ను సంక్రాంతికి వస్తున్నాం సినిమా నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది.