'కార్తికేయ' వంటి సక్సెస్ ఫుల్ మూవీతో డైరెక్టర్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చందూ మొండేటి.. 'ప్రేమమ్' మూవీతో క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు. కానీ 'సవ్యసాచి' సినిమా ప్లాప్ అవ్వడంతో రేసులో కాస్త వెనకబడిపోయాడు. ఈ నేపథ్యంలో కొంత గ్యాప్ తీసుకున్న చందూ.. 'కార్తికేయ 2' మూవీతో భారీ విజయం సాధించి స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు.
నిఖిల్ సిద్దార్థ్ - అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా చందూ మొండేటి తెరకెక్కించిన చిత్రం "కార్తికేయ 2". 'కార్తికేయ' కు సీక్వెల్ గా.. శ్రీ కృష్ణ తత్వం విశిష్టతను తెలియజెప్పే కథాంశంతో ఈ సినిమాని రూపొందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై తీసిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన 'కార్తికేయ 2'.. భారీ వసూళ్లను అందుకుంది. ముఖ్యంగా హిందీ వెర్షన్ నార్త్ మార్కెట్ లో అనూహ్య విజయం సాధించింది. మొదటి రోజు కేవలం యాభై స్క్రీన్స్ లో మాత్రమే రిలీజై.. రోజురోజుకూ థియేటర్ల సంఖ్యను పెంచుకుంటూ పోయింది.
'కార్తికేయ 2' సాధించిన అద్భుతమైన విజయంతో చందూ మొండేటి.. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో హాట్ టాపిక్ గా మారాడు. పలువురు బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ఇప్పటికే మన దర్శకుడితో సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చందూ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
నిజానికి 'కార్తికేయ 2' సినిమా రిలీజ్ అవ్వకముందే గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చందూ మొండేటి ఓ సినిమాకి అడ్వాన్స్ తీసుకున్నారని తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ లో ఓ మూవీ చేయాల్సి ఉందని దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని లైన్ లోకి తీసుకురాడానికి అల్లు అరవింద్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
అంతేకాదు అగ్ర నిర్మాతలు దీన్ని పాన్ ఇండియా మూవీ చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే చందూ కథ కూడా వినిపించేశాడని.. ప్రస్తుతం స్క్రిప్టును పూర్తి చేసే పనిలో ఉన్నాడని అంటున్నారు. అయితే ఇందులో హీరో ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది.
గీతా టీమ్ మాత్రం ఓ పెద్ద హీరోతో ఈ ప్రాజెక్ట్ ని సెట్ చేయాలని ప్లాన్ చేస్తోందట. ఇందులో ఓ బాలీవుడ్ హీరో నటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.
ఇకపోతే చందూ మొండేటి సైతం 'కార్తికేయ 2' సినిమాతో వచ్చిన క్రేజ్ ను కాపాడుకునేలా.. పాన్ ఇండియా సినిమానే చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే పలువురు టాలీవుడ్ దర్శకులు జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారు. మరి చందూ కూడా ఆ జాబితాలోకి చేరుతారేమో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.