సుశాంత్‌ మరణంతో వైజాగ్‌ యువతి ఆత్మహత్య

Update: 2020-06-19 11:34 GMT
బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ రాజ్‌ పూత్‌ ఆత్మహత్య చాలా మంది ఆభిమానులకు గుండెలు పగిలేలా చేసింది. ఉత్తరాదిన పలువురు అభిమానులు సుశాంత్‌ మరణంను జీర్ణించుకోలేక పోతున్నామంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. తాజాగా వైజాగ్‌ కు చెందిన ఒక యువతి సుశాంత్‌ మరణంను జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఆమె సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నప్పటి నుండి కూడా ఇంట్లో ఎవరితో మాట్లాడక పోవడంతో పాటు ఆమె చాలా మూడీగా ఉంటున్నట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

బీహార్‌ నుండి విశాఖపట్నం శ్రీహరిపురంకు వలస వచ్చి ఉంటున్న కుటుంబంకు చెందిన ఆ యువతి టిక్‌ టాక్‌ లో చాలా యాక్టివ్‌ గా ఉండేది. ప్రైవేట్‌ స్కూల్‌ లో టీచర్‌ గా చేస్తున్న ఆమె గత రెండు నెలలుగా స్కూల్‌ లేకపోవడంతో ఇంటికే పరిమితం అయ్యి టిక్‌ టాక్‌ లో ఎక్కువగా మునిగి పోయేది. ఈ సమయంలోనే ఆమెకు ఇష్టమైన సుశాంత్‌ మరణంతో డిప్రెషన్‌ లోకి వెళ్లి పోయింది.

టిక్‌ టాక్‌ లో సుశాంత్‌ మృతికి చెందిన వీడియోలు చూసి చూసి ఆమె మానసికంగా మరింత చలించి పోయింది. చివరకు ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లుగా కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆత్మహత్యకు ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో విచారిస్తున్నారు.
Tags:    

Similar News