అల్లు అర్జున్ ప్రస్తుతం కెరీర్ 19వ సినిమాలో నటిస్తున్నారు. పూజా హెగ్డే- నివేదా పేతురాజ్ ఈ చిత్రంలో కథానాయికలు. త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్ - గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం కాకినాడలో కీలక షెడ్యూల్ చిత్రీకరణ సాగుతోంది. ఈ షెడ్యూల్ లో బన్నీపై పోరాట సన్నివేశాలు సహా కీలకమైన సీన్స్ చిత్రీకరించనున్నారు. తండ్రి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో కథాంశమిది. అందుకే `నేను నాన్న` అనే టైటిల్ ప్రచారంలో ఉంది. 2020 సంక్రాంతికి సినిమా రిలీజ్ కానుంది.
ఏఏ 19 సెట్స్ లో ఉండగానే ఏఏ 20 .. ఏఏ 21 చిత్రాల్ని బన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏఏ 20 చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఐకన్ అనే టైటిల్ ని ప్రకటించారు. ఈ సినిమా సెప్టెంబర్ తొలివారంలో ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఆ మేరకు శ్రీరామ్ ఆదిత్య- దిల్ రాజు బృందం పూర్తి స్థాయిలో ప్రిపరేషన్స్ సాగిస్తున్నారట. అలాగే సుకుమార్ దర్శకత్వంలో ఏఏ 21ని నవంబర్ లో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సుకుమార్ ఇప్పటికే స్క్రిప్టును ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. ఆగస్టు చివరినాటికి పూర్తి స్థాయి స్క్రిప్టుని రెడీ చేస్తారట. ప్రీప్రొడక్షన్ పై సెప్టెంబర్- అక్టోబర్ నాటికే పూర్తి క్లారిటీ వచ్చేస్తుందట.
బన్నిని ఆర్యగా చూపించిన సుకుమార్ ఈసారి ఎలా చూపించబోతున్నారు? అంటే .. అంతకుమించిన ఎగ్జయిటింగ్ స్టోరీని ఎంచుకున్నారు. ఎర్రచందనం స్మగ్లర్ల నేపథ్యంలో ఆద్యంతం రక్తి కట్టించే కథ కుదిరిందట. దక్షిణ భారతదేశంలో విస్తరించి ఉన్న అడవులలో స్మగ్లర్లు సాగించే అకృత్యాలు.. నేర చరిత్రపై కథాంశం ఇది. ఇందులో బన్ని పాత్ర ఏమిటి అన్నది ఇప్పటికి సస్పెన్స్. ఈ చిత్రంలో రష్మిక మందన కథానాయికగా ఫైనల్ అయ్యింది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. దేవిశ్రీ సంగీతం అందించనున్నారు.