ఆది పినిశెట్టి, సమంత, రాహుల్ రవీంద్ర ప్రధాన తారాగణంగా రూపొందిన ‘యూటర్న్’ మూవీ విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకొని దూసుకుపోతోంది..ఈ మూవీలో కీలక పాత్ర పోషించిన ఆది పినిశెట్టి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా తాను సినీ విశ్లేషకులు - రివ్యూలను గౌరవిస్తానని.. వారికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.
ఆది మాట్లాడుతూ.. ‘ఇది జెన్యూన్ ఫిల్మ్.. సామాజిక అంశాలపై రూపొందించిన సినిమా. ప్రస్తుత వర్తమానంలో ఏం జరుగుతోంది.. భవిష్యత్ లో ఏం జరుగుతుందనేది కళ్లకు కట్టినట్టు చూపించాం. అందుకే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది’ అంటూ వ్యాఖ్యానించారు. మంచి సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు. అయితే చిత్రంలో తన పాత్ర ఎంట్రీ అద్భుతంగా ఉంటుందని.. పాత్ర సాగిన తీరును ఎంతో ఇష్టపడ్డానని వివరించారు.
యూటర్న్ సినిమాకు తాము పెద్దగా ప్రచారం చేయలేదని.. కానీ చూసి ప్రేక్షకులు మాత్రం థ్రిల్ ఫీలవుతున్నారని.. ఆ మౌత్ టాకే తమ సినిమాకు విజయాన్ని అందిస్తోందని ఆది చెప్పుకొచ్చారు. తనకు తెలుగులో పవన్ కళ్యాణ్ తో పనిచేయడం చాలా నచ్చిందని.. షూటింగ్ సమయంలో అతడితో గడిపిన క్షణాలు ఎప్పటికీ మరిచిపోలేనన్నారు.