ఆది పినిశెట్టి... క్రియేటివ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఒక విచిత్రం’ సినిమాతో రవి రాజా పినిశెట్టి వారసుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత తమిళంలో కొన్ని సినిమాల్లో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కోలీవుడ్ లో సక్సెస్ అయిన ఈ తెలుగు అబ్బాయి చాలా గ్యాప్ తీసుకొని అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘సరైనోడు’ మూవీలో విలన్ గా తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ తో ‘అజ్ఞాతవాసి’ సినిమాలో కూడా ప్రతినాయకుడిగా తలపడ్డాడు. ఆ తర్వాత నానితో ‘నిన్నుకోరి’ సినిమా.. సోదరుడి దర్శకత్వంలో 'మలుపు' సినిమాలలో నటించాడు. రీసెంట్గా ‘నీవెవరో’ - 'యూ టర్న్' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. అంతేకాకుండా రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘రంగస్థలం’ మూవీతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ 'అన్న'గా నటించాడు ఆది.
'రంగస్థలం' సినిమా తరువాత హీరో కమ్ విలన్ ఆది పినిశెట్టికి తెలుగులో డోఖా లేదనుకున్నారంతా. ఎందుకంటే ఈ సినిమాలో ఆది నటన ఆ రేంజ్ లో ఉంది మరి. ఈ సినిమా ఇచ్చిన ఊపులో సమంతతో కలిసి ఒక సినిమా.. 'క్లాప్' అనే మరో ద్విభాషా సినిమా స్టార్ట్ చేసేసాడు. అయితే తాను ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలచిందనే విధంగా మారిపోయిందట ఈయన కెరీర్. తెలుగు కంటే తమిళంలోనే ఎక్కువు పాపులారిటీ తెచ్చుకున్న ఈ హీరో పరిస్థితి ఇప్పుడు రెంటికిచెడ్డ రేవడ మాదిరి తయారైందట. అటు తమిళంలో ఇటు తెలుగులోనూ మనోడికి కొత్త ఆఫర్స్ రావడం లేదట.
అపుడెప్పుడో సమంత కాంబోలో ఓ సినిమా స్టార్ట్ చేశారు.. మళ్లీ దానీ ఊసే లేదు.., 'క్లాప్' సినిమా క్లాప్ కొట్టిన తర్వాత ఎక్కడికో వెళ్లిపోయింది. పోనీ విలన్ గా మనోడికి ఆఫర్స్ ఇద్దామన్నా మనోడు నెగిటివ్ షేడ్స్ చేసిన సినిమాలు డిజాస్టర్లు, ఫ్లాపులే. ఇదంతా చూసుకుంటే ఆది పినిశెట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చే అవకాశాలు ఇప్పుడైతే కనిపించడం లేదని ఇండస్ట్రీలో టాక్. 'రంగస్థలం' టైమ్ లో ఉన్న రిలేషన్ ని దృష్టిలో పెట్టుకొని మనోడికి చెర్రీ ఏమైనా అవకాశాలు ఇవ్వాలి.. లేకపోతే ఆ సినిమా డైరెక్టర్ సుక్కు భాయ్ ఓ లుక్ వేయాలి. మరి రానున్న రోజుల్లో మనోడి ఫేట్ మారి మళ్ళీ పుంజుకుంటాడేమో చూడాలి.