వైశాలి - గుండెల్లో గోదారి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించాడు హీరో ఆది. తమిళ హిట్ సినిమా మృగం అనువాదంతో తెలుగులో ప్రత్యేకించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆది చక్కని నటుడు అన్న ప్రశంసించే అభిమానులున్నారిక్కడ. అయితేనేం అతడి కెరీర్ ఆశించినంతగా తెలుగులో వెలిగిపోయిందేం లేదు. తెలుగు కుర్రాడినే అయినా ఎందుకనో మనవాళ్ల ఆదరణ లేదని ఆది వాపోయిన సందర్భాలున్నాయ్.
తమిళ తంబీలు ఆదరించినంతగా నన్ను తెలుగు ప్రేక్షకులు ఆదరించలేదన్న ఆవేదన కనిపించింది. అయితే అతడికి ప్యూర్ తెలుగు హీరో అన్న ఐడెంటిటీ రావాల్సిన టైమ్ వచ్చిందిప్పుడు. దానికోసం అతడి ఫాదర్ ఫేమస్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి ఎన్నో ఎత్తుగడలు వేస్తున్నారు. ఆది హీరోగా ద్విభాషా చిత్రాల్ని నిర్మించేందుకు అతడు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే లేటెస్టుగా మలుపు అనే తెలుగు - తమిళ్ ద్విభాషా చిత్రాన్ని నిర్మించారాయన. ఇదే చిత్రంతో ఆది పినిశెట్టి సోదరుడు సత్య ప్రభాస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అన్నను డైరెక్ట్ చేస్తున్న ప్రభాస్ పై ఎలాంటి ఆంక్షలు, నిబంధనలు లేవు. ఎందుకంటే తండ్రి రవిరాజానే నిర్మాత కాబట్టి. క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకుని డైరెక్ట్ చేసే ఛాన్సిచ్చారు.
మంచి కథను ఎంచుకుని, డిఫరెంట్ నేపథ్యంతో సినిమా తీస్తున్నారు. మలుపు తన కెరీర్ ని మలుపు తిప్పేస్తుందని ఓ వైపు ఆది, మరో వైపు సత్య ప్రభాస్ భావిస్తున్నారు. తెలుగులో వరుసగా సినిమా ఆఫర్లు వెల్లువెత్తుతాయన్న నమ్మకంపై ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి.