ప్రేమ పేరుతో మోసాల గురించి చెప్పాల్సిన పనిలేదు. డబ్బున్న బడాబాబులే లక్ష్యంగా ఎర వేసి.. టార్గెట్ చేసి లక్షలు దోచేయడం అటుపై వదిలించుకోవడం కొందరు నెరజానలకు వెన్నతో పెట్టిన విద్య. ఎన్నో పోలీస్ కేసుల్లో ఇలాంటి వ్యవహారాలు బయటపడ్డాయి. ఓవైపు సైబర్ నేరాలతో విచ్చల విడిగా అకౌంట్లను హ్యాక్ చేసి ఖాతాలు ఖాళీ చేస్తుంటే.. మరికొంత మంది ప్రేమ పేరుతో వలలు విసిరి డబ్బు దోచేయడం పరిపాటిగా మారింది. తాజాగా అలాంటి ఘటన ఒకటి చెన్నైలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. `ఆడిపోనా అవడి `సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రుతికి గ్లామర్ ఇండస్ట్రీ ఓ బిగ్ షాక్ అయ్యింది. తొలి ప్రయత్నం తర్వాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో డబ్బు సంపాదించడానికి తప్పు దారి తొక్కింది. ప్రేమ పేరుతో మోసాలకు తెగబడింది.
తొలిగా జర్మనీ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న కోవైకు చెందిన బాలమురగన్ అనే యువకుడిని టార్గెట్ చేసి లక్షల్లో దోపిడీకి పాల్పడింది. దాదాపు 45 లక్షలు వరకూ టోకరా వేసిందిట. తీరా పెళ్లి విషయం ఎత్తే సరికి దూరం పెట్టేసింది. దీంతో బాలమురనగ్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొద్దిరోజుల క్రితమే ఈ సంగతి వెలుగులోకి వచ్చింది. శ్రుతిని ఆమె సహోదరుడు సుభాష్ ని పోలీసులు అరెస్ట్ చేసి ప్రస్తుతం కేసు విచారిస్తున్నారు. అలాగే చెన్నై కు చెందిన అముదన్ అనే మరో యువకుడు కూడా శ్రుతి ప్రియుల జాబితాలో ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇతడినీ శ్రుతి ఇదే తరహాలో మోసం చేసింది. లక్షల్లో ఖర్చు చేయించి హ్యాండ్ ఇచ్చింది.
దీంతో అముదన్ శ్రుతి లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానిన బెదిరింపులకు పాల్పడ్డాడు. పెళ్లి చేసుకోకపోతే యాసిడ్ పోస్తానని బెదిరించాడు. దీంతో హత్యా బెదిరింపులు కింద అముదన్ పై కూడా కేసు నమోదైంది. అయితే ఈ మొత్తం సీన్ లో శ్రుతి కీలక పాత్ర దారి అని...ఆమె వల్ల ఇంకెంత మంది మోసపోయారోననే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ కోవలోనే పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.