బుల్లితెర పెద్ద తెర రెండు చోట్లా రాణించే కథానాయికలు చాలా అరుదు. ఆ కోవకే చెందుతుంది ఆకాంక్ష సింగ్. కింగ్ నాగార్జున సరసన దేవ దాస్ చిత్రంలో నటించింది ఈ బ్యూటీ. ఆ తర్వాతా టాలీవుడ్ లో నటించాలన్న ఆసక్తిని కనబరిచింది. పెళ్లయ్యాకా కెరీర్ బండిని సజావుగా సాగిస్తున్న నాయికగా ఆకాంక్ష కు గుర్తింపు దక్కింది.
చాలా మంది నటీనటులు ఎక్కువగా టీవీ రంగంలో ఉన్నవారు ఏళ్ల తరబడి ఒకే తరహాలో ఒక నిర్దిష్ట పాత్రను పోషించిన తర్వాత మూసగా కనిపిస్తారు. ఇలాంటిదే ఎదుర్కొన్న తరువాత ఆకంక్ష సింగ్ - నా బోలే తుమ్ నా మైనే కుచ్ కహా .. గుల్మోహర్ గ్రాండ్ సీరియళ్లతో బాగానే పాపులరయ్యారు.
``నా బోలే… చిత్రీకరణ సమయంలో నా ఏజ్ చిన్నదే. తెరపై తల్లిగా నటించడాన్ని సవాలుగా తీసుకున్నాను. అలాంటి పాత్రతో అరంగేట్రం చేయవద్దని లేదా నేను మూసపోతలో ఉండవచ్చని చాలా మంది నన్ను హెచ్చరించారు. కాని ప్రజలు నా పనిని ఇష్టపడితే చాలని అనుకున్నాను. కానీ నేను చేసింది తప్పేనని ప్రూవైంది! 18-23 సంవత్సరాల వయస్సు గల తల్లుల పాత్రలను మాత్రమే పొందుతున్నాను. నేను ఇప్పటికీ టీవీలో అలాంటి ఆఫర్ లే వెంటపడుతున్నాయి. టీవీలో మూస అవకాశాలు ఒక పీడకల కన్నా తక్కువ కాదు.. అని అన్నారు.
రెండు సంవత్సరాల తరువాత గుల్మోహర్ గ్రాండ్ అనే టీవీ షోలో ఆమె వేరే పాత్ర పోషించినా సీన్ మెరుగవ్వలేదట. దాంతో ఆకాంక్ష తిరిగి థియేటర్ డ్రామాల్లో చేయడానికి వెళ్ళింది. కొన్ని ప్రకటనలు చేసింది. అదృష్టవశాత్తూ బద్రీనాథ్ కి దుల్హానియా (2017) చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టే అవకాశం వచ్చింది.. అని తెలిపింది. ప్రస్తుతం హిందీ చిత్రసీమతో పాటు ఇటు తెలుగు తమిళంలో అవకాశాల కోసం ఆకాంక్ష ప్రయత్నిస్తోందట. ఆ క్రమంలోనే వేడెక్కించే ఫోటోషూట్లను షేర్ చేస్తోంది. తాజాగా ఇన్నర్ ఎలివేషన్ తో హాట్ ఫోటోని షేర్ చేయగా అది అంతర్జాలంలో వైరల్ గా మారింది.