కొడుకు కోసం కలిసిన మాజీ దంపతులు

Update: 2021-12-02 04:32 GMT
బాలీవుడ్‌ సూపర్ స్టార్‌.. మిస్టర్ పర్ఫెక్ట్‌ అమీర్ ఖాన్ ఇటీవలే తన రెండవ భార్య అయిన కిరణ్‌ రావుకు విడాకులు ఇచ్చిన విషయం తెల్సిందే. ఒక సినిమా షూటింగ్ సందర్బంగా ప్రేమలో పడ్డ వీరిద్దరు సుదీర్ఘ కాలం వైవాహిక జీవితంలో కొనసాగారు. వీరికి ఆజాద్ అనే బాబు ఉన్నాడు. ఇటీవల వీరిద్దరు కలిసి ఉండటం కష్టం అనే నిర్ణయానికి వచ్చి విడి పోయేందుకు నిర్ణయం తీసుకున్నాడు. విడాకులు తీసుకుంటున్నట్లుగా ప్రకటించిన తర్వాత కూడా ఇద్దరు కలిసి వర్క్‌ చేశారు. అమీర్ ఖాన్ లాల్ సింగ్‌ చద్దా సినిమాకు గాను కిరణ్ రావు వర్క్ చేసిన విషయం తెల్సిందే. ఆమె తో ఇప్పటికి సన్నిహిత సంబంధాలను అమీర్ ఖాన్ కొనసాగిస్తున్నాడు. లాల్ సింగ్‌ చద్దా సినిమా తర్వాత వీరిద్దరు మళ్లీ కలుస్తారో లేదో అనుకుంటూ ఉన్న సమయంలో కొడుకు పుట్టిన రోజు కోసం వీరిద్దరు కలిశారు.

తాజాగా కొడుకు ఆజాద్‌ పుట్టిన రోజును ఇతర కుటుంబ సభ్యులతో కలిసి అమీర్ ఖాన్ మరియు కిరణ్‌ రావులు జరిపారు. చిన్న పిల్లాడు అవ్వడం వల్ల ఆజాద్ బాధ పడకూడదు అనే ఉద్దేశ్యంతో పుట్టిన రోజు వేడుకకు ఇద్దరు హాజరు అయ్యారని సమాచారం అందుతోంది. అమీర్ ఖాన్ మరియు కిరణ్‌ రావులు కలిసి వారి కొడుకు బర్త్‌ డే వేడుక నిర్వహించారు. విడిపోయిన వారు ఈగో కారణాల వల్ల మళ్లీ కలిసేందుకు ఆసక్తి చూపించరు. ఏదైనా ముఖ్య సందర్బాల్లో కనీసం వారి గురించి ట్వీట్‌ పెట్టేందుకు కూడా ఆసక్తి చూపించరు. కాని వీరిద్దరు మాత్రం కొడుకు కోసం ఇలా కలవడం అనేది అభినందనీయం అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు మాత్రం అంత చిన్న బాబును మీరిద్దరు విడి పోయి మానసికంగా చాలా ఇబ్బంది పెడుతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అమీర్ ఖాన్ మరియు కిరణ్ రావులు ముందు ముందు కూడా భార్య భర్తలుగా విడిపోయినా స్నేహితుల మాదిరిగా కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. అదే మాదిరిగా ఉంటున్నారు. అమీర్ ఖాన్ తదుపరి సినిమాలకు కూడా కిరణ్ రావు వర్క్‌ చేస్తుందని బాలీవుడ్‌ వర్గాల వారు అంటున్నారు. ఇక లాల్‌ సింగ్‌ చద్దా సినిమా విషయానికి వస్తే ఆ సినిమా ఈ నెలలో విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ పెండింగ్ లో ఉన్న కారణంగా వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. అమీర్‌ ఖాన్‌ మళ్లీ పెళ్లి చేసుకుంటాడనే వార్తలు వస్తున్నాయి. ఆమద్య ఒక హీరోయిన్ తో ఈయన ప్రేమలో ఉన్నాడని కూడా పుకార్లు షికార్లు చేశాయి. మరి ఎంత వరకు నిజం అనేది చూడాలి.
Tags:    

Similar News