మిస్టర్ పర్ ఫెక్ట్ కమ్ బాలీవుడ్ మెగాస్టార్ గా పేరున్న అమీర్ ఖాన్ అనూహ్యంగా ఏపీలోని పోర్టు పట్టణం కాకినాడకు వచ్చిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అర్థరాత్రి వేళ కాకినాడకు చేరుకున్న ఆయన.. నేరుగా అక్కడి సరోవర్ పోర్ట్ కో హోటల్ లో బస చేసినట్లుగా చెబుతున్నారు. ఇంతకీ ఆయన కాకినాడకు రావాల్సిన అవసరం ఏమిటన్న విషయంలోకి వెళితే.. తాజాగా ఆయన ‘లాల్ సింగ్ చద్దా’ పేరుతో ఒక మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్మీ జవాను జీవిత కథ ఆధారంగా తీస్తున్న ఈ మూవీకి సంబంధించిన కీలకమైన షూటింగ్ పార్ట్ కాకినాడలో ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు.
ఇందులో పాల్గొనటం కోసం ఆయన కాకినాడకు చేరుకున్నారు. అయితే.. పట్టణంలోకి అడుగు పెట్టిన అనంతరం నేరుగా హోటల్ కు చేరుకున్న అమీర్.. బుధవారం అర్థరాత్రి నుంచి గురువారం మొత్తం హోటల్లోనే పరిమితమైనట్లుగా తెలుస్తోంది. ఆయన్ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నా.. హోటల్ నుంచి బయటకు రాకపోవటంతో ఎంతగానో ఎదురుచూసిన ఆయన అభిమానులు నిరాశగా వెనుదిరిగారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం షూటింగ్ ను కాకినాడ - ఉప్పాడ, బీచ్ తో పాటు పోర్టులోనూ చేస్తారని చెబుతున్నారు. అమలాపురం సమీపంలోని ఓడలరేవు బీచ్ తో పాటు మరిన్ని ప్రముఖ ప్రాంతాల్లో కూడా షూటింగ్ జరుగుతుందని చెబుతున్నారు. ఇదే చిత్రంలో నాగచౌతన్య ప్రత్యేక పాత్రలో నటిస్తున్నట్లుగా చెబుతున్నారు. బాలీవుడ్ అగ్ర కథానాయకుడైన అమీర్ ఖాన్ కాకినాడకు రావటంతో.. హోటల్ లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తగినంత సెక్యురిటీని కల్పిస్తున్నారు. మొత్తానికి షూటింగ్ కోసం కాకినాడకు వచ్చిన అమీర్ ఖాన్ కొద్దిరోజులు ఉంటారని చెబుతున్నారు.