క‌ర‌ణ్ తో కాఫీ కి లాల్ సింగ్ ఒక్క‌డేనా?

Update: 2022-07-29 00:30 GMT
`కాఫీవిత్ క‌ర‌ణ్` టాక్ షో దేశ వ్యాప్తంగా ఎంతో ?  ఫేమ‌స్ టాక్ షో అన్న‌ది తెలిసిందే. అన్ని భాష‌ల ప్రేక్ష‌కుల్ని అల‌రించిన ఏకైక బాలీవుడ్ టాక్ షో ఇది.  బాలీవుడ్ టాక్ షోల గురించి మాట్లాడాల్సి వ‌స్తే క‌ర‌ణ్ టాక్ షోకి ముందు..త‌ర్వాత అని క‌చ్చితంగా చెప్పాల్సి. క‌ర‌ణ్  తో  కాఫీ షేర్ చేసుకోవ‌డం అంటే అంత వీజి కాదు. పూర్తి ఓపెన్ మైండ్ తో హాజ‌ర‌వ్వాలి.

ఎలాంటి ప్రశ్న‌లనైనా ఎదుర్కునే ద‌మ్ముండాలి. సినిమాల‌తో పాటు..వ్య‌క్తిగ‌త విష‌యాల్ని టాక్ షోలో చ‌ర్చించ‌డం క‌ర‌ణ్ ప్ర‌త్యేక‌త‌. టాక్ షో అంత పెద్ద హిట్ అవ్వ‌డానికి ప్ర‌ధాన కార‌ణం వ్య‌క్తిగ‌త ప్ర‌శ్న‌లే.

ఈ కార‌ణంగా ఎన్నోసార్లు టాక్ షో వివాదాస్పందంగా మారిన సంద‌ర్భాలున్నాయి. సెల‌బ్రిటీలు..క్రికెట‌ర్ల‌ని టాక్ షోకి ఆహ్వానించి వారి ప్ర‌యాణాల గురించి ప్ర‌స్తావించ‌డం..ఎఫైర్ల సంగ‌తి తేల్చ‌డం వంటివి  టాక్ షోలో మెయిన్ హైలైట్ గా చెప్పొచ్చు.

క‌ర‌ణ్ టాక్ షో అంటే ఇద్ద‌రు..ముగ్గురు సెల‌బ్రిటీలు త‌ప్ప‌నిస‌రి. సింగిల్ గా ఏ సెల‌బ్రిటీని క‌ర‌ణ్ ఆహ్వానించ‌రు. అది చాలా రేర్ గానే జ‌రుగుతుంది. తాజాగా అమీర్ ఖాన్ కోసం క‌ర‌ణ్  అలాంటి వేదిక‌నే సిద్దం చేసిన‌ట్లు తెలుస్తోంది. అమీర్ ఖాన్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `లాల్ సింగ్ చ‌ద్దా` త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్న సంగ‌తి తెలిసిందే.

దీంతో అమీర్ ఖాన్ గెస్ట్ గా సోలోగానే ఇంట‌రాక్ట్ అవుతున్నారు. ఈ విష‌యాన్ని క‌ర‌ణ్ అధికారికంగా  వెల్ల‌డించారు. ఇది తెలుగు ప్రేక్ష‌కుల‌కు షాకింగ్ అనే చెప్పాలి. లాల్ సింగ్ చ‌ద్దాలో నాగ‌చైత‌న్య కీల‌క పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అమీర్ తో పాటు నాగ‌చైత‌న్య కూడా హాజ‌ర‌వుతార‌ని చాలా మంది భావించారు. కానీ ఆ ఛాన్స్ లేద‌ని తేలిపోయింది.

మ‌రి చైత‌న్య బిజీ షెడ్యూల్ కార‌ణంగా వీలు ప‌డ‌లేదా?  లేక ఇంకేమైనా కార‌ణాలు ఉన్నాయా? అన్న‌ది తెలియాలి. చైత‌న్య‌కి ఈ సినిమా బాలీవుడ్ లో డెబ్యూ మూవీ. ఈ నేప‌థ్యంలో అన్ని ర‌కాల‌ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌కు చై తప్ప‌కుండా హాజ‌ర‌వుతున్నారు. కానీ కీల‌క‌మైన క‌ర‌ణ్ టాక్ షోకి హాజ‌రు కాక‌పోవ‌డం అభిమానుల్ని  నిరుత్సాహ ప‌రుస్తుంది. మ‌రి చైత‌న్య తో కూడా క‌ర‌ణ్ సోలోగానే  కాఫీ షేర్ చేసుకునే ఆలోచ‌న‌లో ఉన్నారో? ఏంటో?   చూడాలి.
Tags:    

Similar News