మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కి గట్స్ లేవా? `మహాభారతం` తెరకెక్కించలేడా? ఇప్పటికీ ఇంకా భయపడుతున్నాడు! రాజమౌళి బాహుబలి రిలీజయ్యాక ప్రకటించాడు. చాలా ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు.. రిలయన్స్ 1000 కోట్లు పెట్టేందుకు సిద్ధమైనా కానీ.. అతడు ముందుకెళ్లలేదు.. డేర్ చేయనేలేదు!
ఈలోగా ఇతర దర్శకులు మహాభారత్ చేస్తున్నారు... ఓం రౌత్ అయితే ఏకంగా `రామాయణం`పై `ఆదిపురుష్ 3డి` తీసేసాడు. అయినా అమీర్ కి గట్స్ లేవ్ ... చూస్తుంటే రాజమౌళినే కాస్త అటూ ఇటూగా `మహాభారతం 3డి` తీసేట్టున్నాడు...? ఓవైపు అల్లు రామాయణం గురించి వేడెక్కించే అప్ డేట్లు వస్తుంటే అమీర్ మాత్రం ఇంకా మిన్నకుండిపోయాడు.. `మహాభారతం` గురించి ఏదీ మాట్లాడకుండా..
అయితే దీనిపై లాల్ సింగ్ చడ్డా ప్రచారంలో ఓ ప్రశ్నకు సమాధానంగా అతడు ఓపెనయ్యాడు. మహాభారతంపై సినిమా తీయడంపై అమీర్ ఖాన్ మాట్లాడుతూ..``నేనింకా దానికి సిద్ధంగా లేను.. నేను భయపడ్డాను!`` అని వ్యాఖ్యానించాడు. మహాభారతంపై సినిమా తీయాలంటే చాలా ఏళ్లు కష్టపడాల్సి ఉంటుందని దానికి తాను ఇంకా సిద్ధంగా లేనని.. ఇప్పుడే దాన్ని బయటకు తీసుకురావడానికి భయపడుతున్నానని అమీర్ ఖాన్ చెప్పాడు. మహాభారతంపై సినిమా చేయడం తన కల అని అమీర్ ఖాన్ చెప్పారు.
హిందూ పౌరాణిక ఇతిహాసమైన మహాభారతంపై సినిమా తీయాలనే తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి అమీర్ ఖాన్ చాలా కాలం తర్వాత మరోసారి మాట్లాడాడు. దానిపై పని చేయడానికి భయపడుతున్నానని చెప్పాడు. అమీర్ మహాభారతం ఆధారంగా భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించాలనే ఆలోచనలో చాలా కాలంగా ఉన్నాడు. వాస్తవానికి 2018లో అతను రాకేష్ శర్మ బయోపిక్ నుండి తప్పుకున్నాడు. అందువల్ల అతను రూ.1000-కోట్ల బడ్జెట్ తో నిర్మించే మహాభారతం కోసం పని చేస్తున్నాడని రచయిత అంజుమ్ రాజబాలి 2018లో జరిగిన ఒక కార్యక్రమంలో మీడియాతో చెప్పారు.
తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ఓ ఇంటర్వ్యూలో అమీర్ మాట్లాడుతూ-``మహాభారతంపై పని చేయడం అంటే కేవలం సినిమా తీయడం లేదు.. యాగం చేస్తున్నాము అని అర్థం. ఇది సినిమా మాత్రమే కాదు.. అంతకుమించి..! అందుకే నేను ఇంకా దానికి సిద్ధంగా లేను. ఆ కథను బయటకు తీసుకురావడానికి నేను భయపడుతున్నాను. మహాభారతం ఎవరినీ ఎప్పటికీ నిరాశపరచదు...`` అని అన్నారు. ఇతిహాసంపై చిత్రానికి ఎంత సమయం అవసరమో అమీర్ మాట్లాడాడు. ఓ ఇంటర్వ్యూలో-``ఇది ఒక కోరిక. ఇది నాకు డ్రీమ్ ప్రాజెక్ట్. కానీ ఈరోజు నేనే మేకింగ్ చేయాలి అని నిర్ణయించుకుంటే దానికి 20 ఏళ్లు ఇవ్వాలి. అందుకే నేను భయపడుతున్నాను. నేను అవును.. చేయాలని నిర్ణయించుకుంటే.. ఐదేళ్లు పరిశోధనలో తరవాతి సమయం అంతా తెరకెక్కించడానికి మాత్రమే అవసం. ముందుగా కథ కంటెంట్ ఇతర మెటీరియల్ నన్ను చాలా ఎగ్జయిట్ చేయాలి`` అని అన్నారు.
అమీర్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం `లాల్ సింగ్ చడ్డా` ప్రమోషన్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 1994లో విడుదలైన హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్ కి అధికారిక రీమేక్ ఇది. లాల్ సింగ్ చడ్డా కోసం కూడా అమీర్ ఒక దశాబ్దానికి పైగా పనిచేసారు. అద్వైత్ చౌహాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కరీనా కపూర్ ఖాన్ - మోనా సింగ్- నాగచైతన్య ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. అక్షయ్ కుమార్ నటించిన రక్షాబంధన్ చిత్రం ఆగస్ట్ 11న థియేటర్లలో విడుదలవుతుండగా ఆ సినిమాతో అదే రోజు బాక్సాఫీస్ ఘర్షణకు సిద్ధమవుతోంది.