సోష‌ల్ మీడియాపై అమీర్ ఖాన్‌.. అన్నీ చెప్పి అస‌లు విష‌యం ఆపేశాడుగా!

Update: 2021-03-17 17:30 GMT
బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ త‌న సినిమాల విష‌యంలో ఎంత ప‌క్కాగా ఉంటాడో.. లైఫ్ విష‌యంలో ఇంకా ప్లానింగ్ తో ఉంటాడు. అలాంటి అమీర్.. ఇటీవ‌ల త‌న‌ సోష‌ల్ మీడియా అకౌంట్ల‌న్నీ క్లోజ్ చేశాడు. ఉన్న‌ట్టుండి అమీర్ ఖాన్ ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డంతో ఫ్యాన్స్ ఆవేద‌న‌కు గుర‌య్యారు. కార‌ణం ఏంట‌న్న‌ది మిగిలిన వారికి సైతం అంతు చిక్క‌లేదు.

ఇది అర్థంకాని మీడియా కూడా నేరుగా అత‌న్నే విష‌యం క‌నుక్కునేందుకు సిద్ధ‌మైంది. తన లేటెస్ట్ మూవీ 'కోయి జానె నా' స్క్రీనింగ్ సందర్భంగా బయటకు వచ్చిన అమీర్ ను ఈ విష‌య‌మై ఆరాతీశారు మీడియా ప్ర‌తినిధులు. దీనిపై అమీర్ మాట్లాడుతూ.. తాను సోష‌ల్ మీడియాకు దూర‌మ‌వ‌డంపై ఏవేవో ఊహించుకొని చాలా మంది క‌థ‌లు అల్లుతున్నార‌ని చెప్పారు.

తాను సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండ‌ట్లేద‌ని చెప్పిన అమీర్‌.. ఈ మ‌ధ్య మీడియానే చాలా యాక్టివ్ ఉంటోంద‌ని న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. ఇక‌పై తాను ఫ్యాన్స్ తో మాట్లాడాల్సి వ‌స్తే.. మీడియా ద్వారానే మాట్లాడుతాన‌ని కూడా చెప్పారు. అదే మీడియాకు కూడా మంచిద‌ని చెప్పుకొచ్చారు.

ఇక త‌న సినిమాల గురించి అభిమానులు తెలుసుకోవాల‌ని అనుకుంటే.. త‌న ప్రొడ‌క్ష‌న్ వెబ్ సైట్‌, దానికి సంబంధించిన సోష‌ల్ మీడియాలో చూడొచ్చ‌ని చెప్పారు. ఈ విధంగా.. అన్నీ మాట్లాడిన అమీర్‌.. సోష‌ల్ మీడియా నుంచి తాను వైదొల‌గ‌డంపైన మాత్రం స్ప‌ష్టంమైన ఆన్స‌ర్ ఇవ్వ‌లేదు.
Tags:    

Similar News