గత కొంతకాలంగా మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ .. ఆయన కూతురు ఇరా ఖాన్ చేస్తున్న ప్రయోగాలు నెటిజనుల్ని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా లుక్ పరంగా ఆ ఇద్దరూ రకరకాల ప్రయోగాలతో హీట్ పెంచుతున్నారు. అమీర్ కి ఇదేమీ కొత్త కాకపోయినా ఇరా కూడా తండ్రి బాటలో ఇలా చేస్తుండడంతో నెటిజనుల్లో ఒకటే ఆసక్తికర చర్చ సాగుతోంది. డాడీని మించి కూతురు హెయిర్ స్టైలింగ్ సహా మేకప్ లో రకరకాల ప్రయోగాలు చేయడం హీటెక్కిస్తోంది. ఈ ప్రయోగాలకు ఇన్ స్టా కేరాఫ్ అడ్రెస్ గా మారింది.
తాజాగా ఇన్ స్టాలోకి తండ్రీ కుతుళ్ల కొత్త ఫోటో రిలీజైంది. ఇందులో అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ ఫాదర్స్ డేని సెలబ్రేట్ చేసింది. తాజా పోస్ట్ లో అమీర్ బూడిదరంగు కేశాలంకరణ షాక్ నిస్తోంది. అమీర్ ఖాన్ నెవ్వర్ బిఫోర్ లుక్ ఇదని చెప్పొచ్చు. ఇంతకుముందు పీకే- దంగల్ కోసం ప్రయోగాలు చేశాడు. దిల్ చహతా హై వంటి చిత్రాల కోసం అతడు లుక్ పరంగా చాలా మార్పులు చేసినా.. ఈసారి వాటన్నిటి కంటే భిన్నంగా మారిపోయాడు. అతడి హెయిర్ స్టైల్ పండు వెంట్రుకలతో ఫంకీ స్టైల్లో మైమరిపిస్తోంది. అమీర్ ఎంతో పెప్పీగా రొమాంటిక్ గా కనిపిస్తున్నాడు ఈ లుక్ లో. సింపుల్ గా చెప్పాలంటే రెమోలా కనిపిస్తున్నాడు అంటే అతిశయోక్తి కాదు. ఇంతకీ ఈ లుక్ ని డిజైన్ చేసింది ఎవరు? అంటే ఇంకెవరు కూతురు ఇరానే. కుమార్తె ఇరా ఖాన్ ఇన్ స్టాలో షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.
అమీర్ అభిమానులకు ఈ కొత్త లుక్ పిచ్చిగా నచ్చేసింది. “వావ్.. ఇది చాలా అద్భుతమైన ఫోటో. అమీర్ లుక్ ఎప్పటిలాగే చాలా బాగుంది” అని వ్యాఖ్యానించాడో నెటిజన్. “ఇప్పుడు అతను బూడిదరంగు జుట్టుతో తండ్రిలాగా కనిపిస్తున్నాడు” అని వేరొక అభిమాని కామెంట్ పెట్టాడు. ఫాతిమా సనా షేక్ సహా.. సన్యా మల్హోత్రా కొన్ని ఇన్-లవ్ ఎమోజీలను షేర్ చేయడమే గాక అమీర్ లుక్ ని ప్రశంసించారు.
మార్చి నుండి అమీర్ కుటుంబం లాక్ డౌన్లో ఉంది. ఇరా తన ఇంట్లో అమీర్ పై ప్రయోగాలు చేస్తోంది. సవతి తల్లి కిరణ్ రావు .. సోదరుడు ఆజాద్ రావు ఖాన్ లతో ఇరా టైమ్ పాస్ చేస్తోంది. అమీర్ మేనకోడలు జైన్ మేరీ ఖాన్ నటించిన తొలి చిత్రం `మిసెస్ సీరియల్ కిల్లర్` ప్రీమియర్ కి కుటుంబ సమేతంగా అమీర్ అటెండయ్యారు.