రికార్డులు బద్దలయ్యే సమయం వచ్చింది

Update: 2016-12-23 01:30 GMT
నాకు నేనే పోటీ అనే మాట బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కు పర్ఫెక్టుగా సూటవుతుంది. మిగతా హీరోలందరూ అమీర్ ను అందుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే.. అతను మాత్రం తనతో తనే పోటీ పడుతూ రికార్డుల వేటలో దూసుకెళ్తున్నాడు. ఇండియాలో తొలి రూ.100 కోట్ల కలెక్షన్ల రికార్డులు అందుకున్నది అతనే. ఆ తర్వాత రూ.200 కోట్లు.. రూ.300 కోట్లు.. ఇలా ఒక్కో మైలురాయిని ముందు తనే దాటుతూ వెళ్తున్నాడు అమీర్. గత దశాబ్ద కాలంలో అమీర్ నటించిన గజని.. త్రీ ఇడియట్స్.. ధూమ్-3.. పీకే.. ఇలా ప్రతి సినిమా రికార్డుల మోత మోగించింది. తన రికార్డుల్ని తనే బద్దలు కొడుతూ దూసుకెళ్తున్నాడు అమీర్.

ఇప్పుడు అమీర్ కొత్త సినిమా ‘దంగల్’ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా కూడా రికార్డుల్ని తిరగరాస్తుందనే విషయంలో ఎవరికీ సందేహాల్లేవు. ఎందుకంటే ట్రైలర్ చూడగానే ఇది మామూలు సినిమా కాదని అర్థమైపోయింది. నెల రోజుల కిందటే బాలీవుడ్ సెలబ్రెటీలకు ఈ సినిమా ప్రివ్యూ వేసి చూపించాడు అమీర్. వాళ్లందరూ సినిమా అద్భుతం అని తేల్చేశారు. సోషల్ మీడియాలో రివ్యూలు కూడా పెట్టేశారు. ఈ నేపథ్యంలో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. సినిమాకు భారీగా ఓపెనింగ్స్ వచ్చే అవకాశముంది. డీమానిటైజేషన్ ప్రభావం ఉన్నప్పటికీ ‘దంగల్’ రికార్డుల్ని తిరగరాస్తుందనే భావిస్తున్నారు. అమీర్ చివరి సినిమా ‘పీకే’ రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆ రికార్డును ‘దంగల్’ బద్దలు కొట్టడం ఖాయమని అంచనా. చూద్దాం ఏం జరుగుతుందో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News