ట్రైలర్ టాక్ః రెక్టార్ స్కేల్ కాదు రాజా

Update: 2017-05-05 12:30 GMT
''నా చేతికి పూనకం వస్తే.. నీ బాడీ భూకంపం వచ్చినట్లే. రెక్టార్ స్కేల్ పగిలిపోద్ది''.. ఈ మాస్ డైలాగ్ మాస్ లో అబ్బో అనే రేంజులో ఉంటుందేమో కాని.. చదువుకున్న వారికి మాత్రం.. ''రెక్టార్ స్కేల్ కాదు నాయనా.. భూకంపాన్ని కొలిచేది రిక్టర్ స్కేల్'' అని వెంటనే చెప్పాలని అనిపిస్తుంది. మ్యాజిక్కే కాని లాజిక్ లేని మాస్ మసాలా సినిమాలను రూపొందించడంలో ఆరితేరిన సీనియర్ డైరక్టర్ బి.గోపాల్.. ఇప్పుడు మరుగునపడిన ఒక సినిమాను ''ఆరడుగుల బుల్లెట్'' అంటూ తీసి బయటేస్తున్నారు. పదండి ఈ ట్రైలర్ చూద్దాం.

గోపిచంద్ హీరోగా నయనతార హీరోయిన్ గా రూపొందిన రొటీన్ యాక్షన్ సినిమా.. ''ఆరడుగుల బుల్లెట్''. అనివార్య కారణాలు వలన ఆగిపోయిన ఈ సినిమాను ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. కంటెంట్ పరంగా చూస్తే.. సినిమాలో రొటీన్ మసాలా తప్పించి ఏమీ లేదని ట్రైలర్ చూస్తే చెప్పేయొచ్చు. యాజిటీజ్ గా ఫాథర్ సెంటిమెంట్ కథతో మరో సినిమా వచ్చిందంతే. తండ్రిగా ప్రకాష్‌ రాజ్.. విలన్ గా అభిమన్యు సింగ్.. హీరోయిన్ గా నయనతార.. అలా మెరిశారంతే. ఇక హీరోయిన్ ప్రేమించడానికి గోపిచంద్ కాకుండా.. ఒక బ్రహ్మానందం.. కూడా ఉన్నాడు. డీఫక్ రాజ్ అంటూ క్యారెక్టర్ చేశాడు.

ఓవరాల్ గా ట్రైలర్ చూస్తే సినిమా చూడాలనే ఆత్రం కాని.. ఇదేదో రికార్డులు సృష్టిస్తుందనే హోప్ కాని లేవు. గోపిచంద్ నుండి వస్తున్న యాక్షన్ మాస్ సినిమాల్లో ఇదే ఆఖరిది అయితే బాగుండు.


Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News