అదిరిపోయే స్టెప్పులతో పాటూ అద్భుతమైన హావభావాలను అందించడంలో కూడా తారక్ తనకి తానే సాటి. స్టార్ గా కాకుండా యాక్టర్ గా కనిపించే సన్నివేశాలు తారక్ తప్పకుండా వుంటాయి. జనతా గేరేజ్ ఎంతటి కలెక్షన్లను అందుకున్నా, నాన్నకు ప్రేమతో ఎంత స్టైలిష్ గా తీసినా తారక్ కెరీర్ లో టెంపర్ సినిమా మాత్రం ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుంది.
దర్శకుడు పూరి - నటుడిగా తారక్ ఫ్లాపుల మధ్యనున్న సమయంలో వచ్చిన టెంపర్ కి మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా హీరో పాత్ర చిత్రీకరణ మెప్పించింది. ఈ కథనే బాలీవుడ్ లో తెరకెక్కించాలని పూరి ట్రై చేశాడట. అభిషేక్ బచ్చన్ ని హీరోగా భావిస్తూ అతనితో సిట్టింగ్ కూడా జరిగిందట.
అయితే తెలుగు వెర్షన్ చూసిన అభిషేక్ తారక్ రేంజ్ లో ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వలేనని చెప్పడంతో సినిమా పట్టాలెక్కలేదని పూరి తెలిపాడు. నిజంగా ఒక నటుడికి ఇంతకన్నా గర్వమైన సందర్భం ఏముంటుంది చెప్పండి? పూరి కళ్యాణ్ రామ్ కలయికలో తెరకెక్కిన ఇజం సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/