సంక్రాంతికి వస్తున్నాం: గడిచిన 24 గంటల్లో రెస్పాన్స్ ఏ స్థాయిలో ఉందంటే..

ఇక గడచిన 24 గంటల్లో 1.7 లక్షల టిక్కెట్లు అమ్ముడైనట్లు వెల్లడైంది. ఇదే రేంజ్‌లో ఆదివారం కలెక్షన్లు ఉంటాయనే అంచనాలు నెలకొన్నాయి.

Update: 2025-01-26 05:04 GMT

ఈ సంక్రాంతికి పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు వచ్చిన విక్టరీ వెంకటేష్‌ లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం అంచనాలకు తగ్గట్లు బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. కామెడీ, క్రైమ్‌, రొమాంటిక్‌ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి సెలవుల్లో అభిమానులందరినీ థియేటర్లకు రప్పించడంలో సక్సెస్‌ అయింది. విడుదలైన తొలి రోజు నుంచే సినిమాకు మంచి టాక్ రావడంతో కలెక్షన్ల పంట పండుతోంది.

ఇక లేటెస్ట్, బుక్ మై షో డేటా ప్రకారం ఈ సినిమా రోజుకో రికార్డ్ ను క్రియేట్ చేస్తోంది. విడుదలైన పది రోజుల తరువాత కూడా థియేటర్స్ నిండుగా కనిపిస్తుండడం విశేషం. ఈ వీకెండ్ ను కూడా సినిమా పర్ఫెక్ట్ గా క్యాష్ చేసుకుంటోంది. శుక్రవారం రోజు నుంచే కలెక్షన్స్ సాలీడ్ గా కొనసాగుతున్నాయి. ఇక శనివారం కూడా బుకింగ్స్ గట్టిగానే ఉండడం విశేషం.

ఇక గడచిన 24 గంటల్లో 1.7 లక్షల టిక్కెట్లు అమ్ముడైనట్లు వెల్లడైంది. ఇదే రేంజ్‌లో ఆదివారం కలెక్షన్లు ఉంటాయనే అంచనాలు నెలకొన్నాయి. మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా, ఇప్పుడు ప్రాఫిట్‌ రూట్‌లోకి ప్రవేశించింది. సంక్రాంతి తరువాత కూడా వర్కింగ్ డేస్‌లోనూ అనూహ్యమైన రెస్పాన్స్‌ రావడం విశేషం. ప్రతి ఏరియాలోనూ హౌస్‌ఫుల్‌ బోర్డులు పడుతుండటం సినిమా విజయాన్ని మరింత స్పష్టంగా చూపిస్తోంది.

సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల గ్రాస్‌ దగ్గరలో ఉంది. అమెరికాలో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లు సాధిస్తోంది. తాజాగా 2.5 మిలియన్ డాలర్ల మార్క్‌ చేరుకుని వెంకటేష్‌ కెరీర్‌లోనే బెస్ట్‌ ఓవర్సీస్‌ రికార్డు సాధించిన సినిమాగా నిలిచింది. వెంకటేష్‌ తన సహజమైన నటనతో ప్రేక్షకులను అలరించగా, అనిల్ రావిపూడి తీసిన వినోదాత్మక స్క్రీన్‌ప్లే సినిమాకు ప్రధాన బలం అని చెప్పవచ్చు.

సంక్రాంతి నేపథ్యంలో మాస్‌, ఫ్యామిలీ ఆడియెన్స్‌ అందరికీ నచ్చేలా రూపొందిన ఈ సినిమా, ప్రేక్షకులను థియేటర్లకు కట్టిపడేస్తోంది. వెంకటేష్‌ నటనకు తగ్గట్లు ఆయన కెరీర్‌లోనే బెస్ట్‌ ఎంటర్టైనర్‌గా నిలుస్తుందని అభిమానులు చెప్పుకుంటున్నారు. ఈ సినిమా కథ, వినోదం, పాటలు అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందడం వల్ల బాక్సాఫీస్‌ వద్ద విజయ పథంలో కొనసాగుతోంది. ఈ కలెక్షన్లు చూస్తుంటే సంక్రాంతికి వస్తున్నాం చిత్రం 300 కోట్ల క్లబ్‌ చేరడం పెద్ద విశేషం కాదని ట్రేడ్‌ విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News