దేవర 2… కొరటాల ప్లాన్ ఏంటీ?
ఈ మూవీ షూటింగ్ కూడా ఈ ఏడాది అక్టోబర్ నుంచి ప్రారంభించడానికి కొరటాల సన్నాహాలు చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత ఏడాది 'దేవర' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి కమర్షియల్ సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమాకి భారీ లాభాలు రాకపోయిన నిర్మాతలని సేఫ్ జోన్ లో ఉంచింది. తెలుగు రాష్ట్రాలలో ఆకట్టుకున్న ఈ మూవీ నార్త్ ఇండియాలో అనుకున్నంత రేంజ్ లో క్లిక్కవ్వకపోయినా.. పెట్టిన పెట్టుబడికి మాత్రం మంచి లాభాలను అందించింది. 'దేవర' చిత్రాన్ని కొరటాల రెండు పార్ట్ లుగా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.
అందులో 'దేవర పార్ట్ 1'లో కథని కొంత వరకు మాత్రమే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. అసలైన కథ 'దేవర పార్ట్ 2'లో ఉంటుందని ఎన్టీఆర్ అభిమానులు భావిస్తున్నారు. కొరటాల శివ కూడా ఈ రెండో పార్ట్ పై అంచనాలు పెంచే విధంగా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. మొదటి పార్ట్ కి మించిన యాక్షన్ ఎలిమెంట్స్, బ్లడ్ పార్ట్ 2లో ఉంటాయని అన్నారు.
అలాగే 'దేవర పార్ట్ 1' ద్వారా వచ్చిన ఫీడ్ బ్యాక్ ని దృష్టిలో ఉంచుకొని 'దేవర పార్ట్ 2' కథని మరింత పకడ్బందీగా సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని సమాచారం. ముఖ్యంగా ఈ సినిమాని కొరటాల శివ నార్త్ ఇండియన్ ఆడియన్స్ ని దృష్టిలో ఉంచుకొని వారికి బలంగా రీచ్ అయ్యేలా కథనంలో మార్పులు చేస్తున్నారంట. కచ్చితంగా సెకండ్ పార్ట్ అంచనాలకి మించి సక్సెస్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది.
ఈ మూవీ షూటింగ్ కూడా ఈ ఏడాది అక్టోబర్ నుంచి ప్రారంభించడానికి కొరటాల సన్నాహాలు చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట. ఎన్టీఆర్ ప్రస్తుతం 'వార్ 2' ఫైనల్ షెడ్యూల్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మూవీని స్టార్ట్ చేస్తారు. ఈ సినిమా హైవోల్టేజ్ కథాంశంతో బర్మా బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని టాక్ వినిపిస్తోంది.
ఈ చిత్రంలో తారక్ ని ప్రశాంత్ నీల్ పవర్ ఫుల్ లీడర్ గా చూపించబోతున్నారంట. ఈ మూవీ సెట్స్ పైన ఉండగానే కొరటాల శివతో 'దేవర 2' కూడా తారక్ స్టార్ట్ చేయొచ్చని అనుకుంటున్నారు. మరి ఇది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది వేచి చూడాలి. ఇక 'దేవర పార్ట్ 1'లో జాన్వీ కపూర్ క్యారెక్టర్ చాలా లిమిటెడ్ గా ఉంటుంది.
అయితే 'దేవర 2'లో మాత్రం ఆమె క్యారెక్టర్ కి ఎక్కువ స్కోప్ ఉండటంతో పాటు అదిరిపోయే ట్విస్ట్ లు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. 'దేవర 1' మూవీ ప్రమోషన్స్ లో కూడా చిత్ర యూనిట్ ఇదే విషయాన్ని చెప్పింది. జాన్వీ కపూర్ కూడా 'దేవర 2' మీదా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది.