శ్రీదేవి, సౌందర్య స్పూర్తితో తెలుగు అమ్మాయి!
తెలుగు అమ్మాయి శ్రీలీల డాక్టర్ కాబోయి యాక్టర్ అయింది. డాక్టర్ కోర్స్ చేయకుండా స్టార్ గా ఫేమస్ అయింది.
తెలుగు అమ్మాయి శ్రీలీల డాక్టర్ కాబోయి యాక్టర్ అయింది. డాక్టర్ కోర్స్ చేయకుండా స్టార్ గా ఫేమస్ అయింది. అటుపై డాక్టర్ పట్టా సంపాదించింది. అయితే ఆమె కెరీర్ విషయంలో శ్రీలీల మామ్ కీలక పాత్ర ధారి. చిన్నప్పటి నుంచి కుమార్తెలో ఫ్యాషన్ గురించిన మామ్ క్లాసిక్ డాన్సర్ గా తీర్చిదిద్దారు. అటుపై నటనా రంగంలోకి రావడం.. సక్సెస్ అవ్వడం అంతా వేగంగా జరిగిపోయింది. ఇలాంటి సక్సెస్ తెలుగు అమ్మాయిల్లో కీర్తికి మాత్రమే సాధ్యమైంది.
తల్లి సహకారం ఉండటంతోనే ఇదంతా సాధ్యమైంది. మరి శ్రీలలకు నటనలో స్పూర్తి ఎవరు? అంటే అమ్మడు ఆసక్తికర సంగతులు చెప్పుకొచ్చింది. `చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఆసక్తే. శ్రీదేవి, సౌందర్య అభిమాన తారలు. వాళ్ల సినిమాలు చూసి వాళ్లలాగే అద్దం ముందు నటించేదాన్ని. `జగదీక వీరుడు అతిలోక సుందరి` చూసాక దేవ కన్యలు అచ్చంగా శ్రీదేవి లాగే ఉంటారనుకునేదాన్ని. ఆమె దేవకన్యలా డాన్స్ చేసిన డాన్సులు ఇప్పటికీ అలా చూస్తూ ఉండిపోతాను.
అంతగా శ్రీదేవి డాన్స్, నటనను ఇష్టపడతాను. సౌందర్య హీరోయిన్ గా చేస్తూ విలన్ పాత్రలు పోషించింది. ఆమె నటన ఎంతో సహజంగా ఉంటుంది. నటిగా మారానంటే కారణం వాళ్లే. వాళ్ల ప్రభావం నాపై ఎక్కువగా ఉంటుంది. అందుకే నటిని అయ్యాక శ్రీదేవి, సౌందర్య లా కలకాలం గుర్తిండిపోయే పాత్రలు చేయాలనుకుంటున్నా. ఇంకా ఆరంభ దశలోనే ఉన్నాను. నటిగా అనేక రకాల పాత్రలు పోషించాలనుకుంటున్నా.
అలాంటి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నా. నటిగా రాణించడ అంత సులభం కాదు. చాలా కష్టపడితే గానీ ఈ స్థానానికి చేరుకోలేకపోయాను` అంది. ప్రస్తుతం శ్రీలీల రవితేజతో `మాస్ జాతర`లో నటిస్తోంది. అలాగే శివకార్తికేయన్ 25వ చిత్రంలోనూ హీరోయిన్ గా ఎంపికైంది. పవన్ కళ్యాణ్ `ఉస్తాద్ భగత్ సింగ్` లోనూ ఛాన్స్ అందుకుంది.