పిక్‌టాక్‌ : ధమ్కీ బ్యూటీ స్టైలిష్ ఫోజ్‌

అక్కడ నుంచి టాలీవుడ్‌లోనూ అడుగు పెట్టిన ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు, ఆ తర్వాత పెద్దగా ఆఫర్లు కూడా రాలేదు.

Update: 2025-02-28 21:30 GMT

'ఉయర్తిరు 420' సినిమాతో కోలీవుడ్‌లో నటిగా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ అక్షర గౌడ. తక్కువ సమయంలోనే కోలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు సొంతం చేసుకుంది. తమిళ్‌లో ఈ అమ్మడు చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. స్టార్‌ హీరోల సినిమాల్లోనే కాకుండా చిన్న హీరోల సినిమాల్లోనూ ఈమె నటించింది. నటిగా గుర్తింపు దక్కించుకోవడంతో పాటు అందాల ఆరబోతతో ఆకట్టుకుంది. మొత్తానికి ఈ అమ్మడు కోలీవుడ్‌లో ఆకట్టుకుంది. అక్కడ నుంచి టాలీవుడ్‌లోనూ అడుగు పెట్టిన ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు, ఆ తర్వాత పెద్దగా ఆఫర్లు కూడా రాలేదు.


తెలుగులో ఈ అమ్మడు మన్మధుడు 2 సినిమాలో గెస్ట్‌ రోల్‌లో కనిపించింది. ఆ సినిమా ఫలితం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిజాస్టర్‌గా ఆ సినిమా నిలవడంతో అక్షర గౌడకి టాలీవుడ్‌లో ఆఫర్లు కష్టమే అనుకున్నారు. కానీ అనూహ్యంగా ది వారియర్‌ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించే అవకాశం దక్కించుకుంది. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ దాస్‌ కా ధమ్కీ సినిమాలో విశ్వక్ సేన్‌తో కలిసి నటించే అవకాశాన్ని దక్కించుకుంది. మెయిన్ హీరోయిన్‌గానే కాకుండా ముఖ్య పాత్రల్లోనూ ఈమె నటిస్తూ ఉండటం వల్ల మంచి సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి.


తెలుగులో దాస్‌ కా ధమ్కీ సినిమా తర్వాత వెంటనే నేనే నా సినిమాలో నటించింది. ఆ తర్వాత హరోం హర సినిమాలోనూ నటించింది. తెలుగులో ఈమె చివరగా గత సంవత్సరం హరోం హర సినిమాతో వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆడలేదు. దాంతో తెలుగులో ఈమెకు మరిన్ని ఆఫర్లు వస్తాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్‌లో ఈ అమ్మడికి కొత్త సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ ఇలాంటి అందమైన ఫోటో షూట్స్ కారణంగా టాలీవుడ్‌లో మరో ఆఫర్‌ వచ్చినా ఆశ్చర్యం లేదు.


తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. స్టైలిష్‌ ఫోజ్ ఇచ్చి నడుము అందాన్ని చూపిస్తూ డిజైనర్‌ నక్లెస్‌ను ధరించిన అక్షర చూపు తిప్పుకోనివ్వడం లేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత అందంగా ఉన్నా పాపం అక్షరకు దక్కాల్సిన ఆఫర్లు దక్కడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ముందు ముందు అయినా ఈ అమ్మడికి మంచి ఆఫర్లు దక్కేనా అనేది చూడాలి. టాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్‌, హిందీలోనూ పలు సినిమాలు చేసిన ఈ అమ్మడు మరో పదేళ్ల పాటు ఇండస్ట్రీలో కొనసాగే సత్తా ఉన్న అందం ఉన్న నటి అంటూ ఈ ఫోటోకు నెటిజన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు.

Tags:    

Similar News