జాన్వి ఫ్యాన్స్ ని హర్ట్ చేస్తున్న దేవి కామెంట్స్..!
శ్రీదేవి తనయురాలు జాన్వి కపూర్ బాలీవుడ్ లో ఒక మోస్తారు ఫాం కొనసాగిస్తుండగా ఈమధ్య ఎన్ టీ ఆర్ దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది
శ్రీదేవి తనయురాలు జాన్వి కపూర్ బాలీవుడ్ లో ఒక మోస్తారు ఫాం కొనసాగిస్తుండగా ఈమధ్య ఎన్ టీ ఆర్ దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. పాన్ ఇండియా రిలీజ్ తో హంగామా చేస్తున్న తెలుగు స్టార్ సినిమాల్లో ఛాన్స్ అనగానే బాలీవుడ్ భామలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో జాన్వి పాప కూడా తారక్ తో సినిమా అంటే పర్ఫెక్ట్ లాచింగ్ అనుకుని దేవర సినిమా చేసింది. ఐతే సినిమా లో తంగం పాత్రలో జాన్వి కేవలం గ్లామర్ షోకి మాత్రమే పనికి వచ్చింది అనిపించింది. తను మాత్రమే చేసే పాత్ర అన్నట్టుగా అనిపించలేదు. ఐతే దేవర 1 కాదు దేవర 2 లో జాన్వి పాత్రకు ఎయిట్ ఉంటుందని అంటున్నారు.
అందుకే సెకండ్ పార్ట్ కోసం జాన్వి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే తన రెండో తెలుగు సినిమాగా రామ్ చరణ్ తో ఫిక్స్ చేసుకుంది జాన్వి కపూర్. బుచ్చి బాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో జాన్వి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడని తెలిసిందే. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై చాలా హోప్స్ ఉన్నాయి.
ఐతే రీసెంట్ గా రాక్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ జాన్వి కపూర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. పుష్ప 3 లో ఆమె స్పెషల్ సాంగ్ చేస్తే బాగుంటుందని అన్నాడు. ఐతే దేవి ఉద్దేశం ప్రకారం జాన్వి గ్లామర్ ఆ స్పెషల్ సాంగ్ కి యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందన్నట్టు చెప్పాడు. కానీ జాన్వి కపూర్ ఫ్యాన్స్ మాత్రం వేరేలా అర్థం చేసుకున్నారు. జాన్వి కేవలం ఐటం సాంగ్స్ కే పనికొస్తున్నా హీరోయిన్ గా వర్క్ అవుట్ అవ్వదా అని కామెంట్స్ చేస్తున్నారు.
ఒకరు చెప్పిన ఒక మాట ఒకరికి ఒకలా మరొకరికి మరోలా అర్థమవుతుంది అంటే ఇదే అనుకోవచ్చు. జాన్వి గ్లామర్ మీద ఉన్న నమ్మకంతోనే దేవి శ్రీ ప్రసాద్ ఈ కామెంట్స్ చేశారని చెప్పొచ్చు. ఐతే డిఎస్పీ కూడా మరీ స్పెషల్ సాంగ్ అన్నట్టు కాకుండా హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ కి జాన్వి పర్ఫెక్ట్ అన్నట్టు చెబితే బాగుండేదని అంటున్నారు. ఏది ఏమైనా పుష్ప 3 లో జాన్వి ఐటెం సాంగ్ అని దేవి చెప్పడం చూస్తే పుష్ప 2 లో ఆమెను ట్రై చేశారా.. ఆమె కాదన్నదా అంటూ సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.