'లైలా' బ్యూటీ ఫుల్ ట్రెండింగ్.. కలర్ ఫుల్ డ్రెస్ లో స్టన్నింగ్ గా..
తమ ప్రాజెక్టుకు సరైన హీరోయిన్ కావాలంటూ వెతుకుతున్న మేకర్స్ కు సూపర్ ఛాయిస్ ఆమెనేని సినీ పండితులు అంచనా వేస్తున్నారు.
లైలా బ్యూటీ.. అదేనండీ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అప్ కమింగ్ మూవీ లైలా ఫిమేల్ లీడ్ ఆకాంక్ష శర్మ.. ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారినట్లు క్లియర్ గా తెలుస్తోంది. తమ ప్రాజెక్టుకు సరైన హీరోయిన్ కావాలంటూ వెతుకుతున్న మేకర్స్ కు సూపర్ ఛాయిస్ ఆమెనేని సినీ పండితులు అంచనా వేస్తున్నారు.
కొద్ది రోజులుగా ఆమె పేరు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది. టాలీవుడ్ లోకి విశ్వక్ సేన్ లైలా మూవీతో అడుగుపెడుతున్న అమ్మడు.. డెబ్యూతో మంచి హిట్ అందుకోవాలని చూస్తున్నట్లు ఉంది. అదే సమయంలో అందాల ఆరబోత విషయంలో తగ్గేదేలే అన్నట్లు సందడి చేస్తోంది. లైలా ఫస్ట్ సాంగ్ లో బికినీతో సెగలు రేపేసిందని చెప్పాలి.
గ్లామరస్ లుక్స్ తో మైండ్ బ్లాక్ చేసిన ఆకాంక్ష.. సోషల్ మీడియాలో చేసే సందడి మామూలుగా ఉండదు. స్టన్నింగ్ పిక్స్ ను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటోంది. అదిరిపోయే ఫోటోలను తన ఫాలోవర్స్ కోసం పంచుకుంటూ అలరిస్తుంటుందనే చెప్పాలి. ఇక తన మూవీ లైలా కోసం ప్రమోషన్స్ బాగానే చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
వరుసగా పోస్టర్స్ షేర్ చేస్తూ.. అప్డేట్స్ ఇస్తూ సందడి చేస్తున్న అమ్మడు.. తాజాగా కిర్రాక్ లుక్ ను పోస్ట్ చేసింది. అది మూవీలోని లుక్ గా తెలుస్తోంది. కలర్ ఫుల్ ట్రెండీ డ్రెస్ లో తన గ్లామర్ తో ఆకాంక్ష సింపుల్ గా ఫిదా చేసిందనే చెప్పాలి. చూపుతోనే మైండ్ బ్లాక్ చేసిన ముద్దుగుమ్మ.. అందరి దృష్టిని తనవైపు ఈజీగా తిప్పినట్లే ఉంది.
వుయ్ ఆర్ ట్రెండింగ్.. అంటూ లైలా ఫస్ట్ సాంగ్ ఇచ్చుకుందాం బేబీ హ్యాష్ ట్యాగ్ ను యూజ్ చేసింది ఆకాంక్ష. ప్రస్తుతం ఆమె లేటెస్ట్ పోస్ట్ వైరల్ గా మారగా.. నెటిజన్లు ఓ రేంజ్ లో రెస్పాండ్ అవుతున్నారు. పిక్ అదిరిపోయిందని చెబుతున్నారు. తెలుగులో బిజీ హీరోయిన్ అయిపోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
అయితే టాలీవుడ్ కు ఆమె కొత్త అయినా.. బాలీవుడ్ లో ఇప్పటికే మంచి గుర్తింపు సంపాదించుకుంది. మోడల్ గా, డ్యాన్సర్ గా, యాక్టర్ గా ఆకాంక్ష పాపులరే. పలు ఆల్బమ్స్ తో మెప్పించిన అమ్మడు.. మహేష్ బాబుతో కలిసి సంతూర్ యాడ్ లో సందడి చేసింది. సంతూర్ మమ్మీగా కనిపించింది ఆమెనే. ఇప్పుడు ఆ సంతూర్ మమ్మీ.. లైలా మూవీతో ఎలాంటి హిట్ అందుకుంటుందో వేచి చూడాలి.