కీర్తి సురేష్ లో సమంత తెచ్చిన మార్పు!
సమంత అగ్రతారగా నీరాజనాలు అందుకుంటోన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగి అమ్మడు ఇప్పుడు బాలీవుడ్ కెరీర్ పై దృష్టి పెట్టి పనిచేస్తోంది
సమంత అగ్రతారగా నీరాజనాలు అందుకుంటోన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగి అమ్మడు ఇప్పుడు బాలీవుడ్ కెరీర్ పై దృష్టి పెట్టి పనిచేస్తోంది. అయితే సమంత అగ్ర తారగ ఎదగడంతో? కీర్తి సురేష్ తానెంతగా అభిమానిస్తుందన్నది తాజాగా రివీల్ చేసింది. `నేను ఎక్కువగా ఇష్టపడే హీరోయిన్లలో మొదటి స్థానం సమంతకే ఇస్తాను. ఇద్దరం తరుచూ కలుసుకోలేకపోవచ్చు. మాట్లాడుకోలేకపోవచ్చు.
కానీ మా మద్య ఎన్నో ఏళ్ల నుంచి అనుబంధం ఉందనిపిస్తుంది. నేను తన సినిమాలను చూస్తూ ఎన్నో టెక్నికల్ విషయాలు తెసుకున్నా. ఎలాంటి పాత్ర అయినా సమంత అవలీలగా పోషించగలదు. ఇదంతా ఆమె అనుభవం నుంచి నేర్చుకుంది. ఆమె ను చూసి నేను అలా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. సమంతలా మారడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటా. మహానటి లో ఇద్దరు కలిసి నటించాం. మా మధ్య పెద్దగా సన్నివేశాలు లేకపోయినా ఆ సినిమా షూటింగ్ నాకెప్పటికీ జ్ఞాపకమే` అని తెలిపింది.
`మహానటి` సినిమాతో కీర్తి సురేష్ కి నటిగా ప్రత్యేకమైన గుర్తింపు దక్కిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియాలో ఆమెకు అభిమానులు ఏర్పడ్డారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు..రివార్డులు సొంతం చేసుకుంది. ఏ నటికి రానంత గుర్తింపు కెరీర్ ఆరంభంలోనే దక్కించుకుంది. కీర్తి మంచి నటి కావడంతోనే సాధ్యమైంది. అయితే ఆ సినిమా తర్వాత అమ్మడి కెరీర్ పుంజు కోలేదు. అవకాశాలు అందుకోవడంలో వెనుకబడింది.
ఈ క్రమంలో తమిళ్ సినిమాలపై దృష్టి పెట్టి బిజీ అయింది. ఆ తర్వాత మెల్లగా మళ్లీ టాలీవుడ్ లోనూ ఛాన్సులందుకుంది. ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తోంది. ఇటీవలే వెబ్ సిరీస్ ల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. `అక్క` అనే బోల్డ్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇందులో అమ్మడు ఏకంగా రాధికా ఆప్టేతోనే పోటీ పడుతోంది.