ర‌ష్మిక గంట‌ల త‌ర‌బ‌డి చూసే సీరియ‌ల్ ఇదే!

స్టార్ హీరోల హిట్ చిత్రాలు డైహార్డ్ ప్యాన్స్ ఎన్నిసార్లైనా...ఎంత ఖ‌ర్చు చేసైనా చూస్తారు. అలాగే ఇత‌ర హీరోలు న‌టించిన చిత్రాలైనా స‌రే అంతే ఆస‌క్తితో చూస్తుంటారు

Update: 2025-01-26 17:30 GMT

స్టార్ హీరోల హిట్ చిత్రాలు డైహార్డ్ ప్యాన్స్ ఎన్నిసార్లైనా...ఎంత ఖ‌ర్చు చేసైనా చూస్తారు. అలాగే ఇత‌ర హీరోలు న‌టించిన చిత్రాలైనా స‌రే అంతే ఆస‌క్తితో చూస్తుంటారు. మ‌రి అలాంటి ఆస‌క్తి నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా కూడా ఉందా? అంటే ఉంద‌నే అంటోంది. న‌టీన‌టుల సంగ‌తి అటుంచితే ర‌ష్మిక 12వ ఏట ఓ కామిక్ సిరీస్ ఎన్నిసార్లు చూసానే త‌న‌కే తెలియ‌దంటోంది. `న‌రుతో ఊజుమాకీ` సిరీస్ లోని న‌రుతే పాత్ర ర‌ష్మిక తొలి క్ర‌ష్ గా చెప్పుకొచ్చింది.

ఆరువంద‌ల ఎపిసోడ్ల‌లో ఏ ఒక్క‌టీ మిస్ చేయ‌లేదంటోంది. ఒక్కోసారి క‌ద‌ల‌కుండా ఒకే సారి 30-40 ఎపిసోడ్లు ఏక‌ధాటిగా చూసిందిట‌. అంటే కామిక్ సిరీస్ ని ర‌ష్మిక ఎంత ఇష్ట‌ప‌డిందో అర్దం చేసుకోవ‌చ్చు. ఇప్పుడు షూటింగ్ ల‌తో ఎంత బిజీగా ఉన్నా? అప్పుడ‌ప్పుడు ఆ కామిక్ సిరీస్ చూస్తానంటోంది. ఈ కామిక్ సిరీస్ కి తానో బానిస‌లా మారిపోయానంటోంది. ఆ త‌ర్వాత మ‌రేసిరీస్ త‌న‌ని అంత‌గా క‌నెక్ట్ చేయ‌లేక‌పోయిందంది.

ప్ర‌పంచ భాషల్లో ఎన్నో సిరీస్ లు వ‌చ్చినా? తాను ఇప్ప‌టికీ ఇష్ట‌ప‌డేది కేవ‌లం `న‌రుతో ఉజు`మాకీ మాత్ర‌మేన‌ని చెబుతుంది. ప్ర‌స్తుతం ర‌ష్మిక న‌టిగా బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. తెలుగుచ హిందీ సినిమాల‌తో క్ష‌ణం తీర‌క లేకుండా గ‌డుపుతోంది. `పుష్ప‌-2` విజ‌యంతో అమ్మ‌డి పాన్ ఇండియా క్రేజ్ అంత‌కంత‌కు రెట్టింపు అయింది. దీంతో అమ్మ‌డితో సోలో చిత్రాలే చేయ‌డానికి రెడీ అవుతున్నారు.

ప్ర‌స్తుతం సికింద‌ర్, త‌మ్మా, ది గ‌ర్ల్ ప్రెండ్, కుబేర చిత్రాల షూటింగ్ లో పాల్గొంటుంది. టాలీవుడ్ లో ఓ అగ్ర నిర్మాత అమ్మ‌డితో లేడీ ఓరియేంటెడ్ చిత్రానికి స‌న్నాహాలు చేస్తున్నాడు. ర‌ష్మిక పాన్ ఇండియా ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఓ యువ ర‌చ‌యిత చెప్పిన స్టోరీ న‌చ్చ‌డంతో? ర‌ష్మిక‌ని లాక్ చేసారు. అయితే ద‌ర్శ‌కుడు ఎవ‌రు? అన్న‌ది ఇంకా ఫైన‌ల్ కాలేదు.

Tags:    

Similar News