పిక్‌టాక్ : నేషనల్ క్రష్ హాలీవుడ్ అందం
నేషనల్ క్రష్ రష్మిక మందన్న పుష్ప 2 సినిమాతో మరోసారి పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న పుష్ప 2 సినిమాతో మరోసారి పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. యానిమల్ సినిమా తర్వాత ఏమాత్రం గ్యాప్ లేకుండా పుష్ప 2 సినిమాతో బాక్సాఫీస్‌ని షేక్ చేయడం ద్వారా ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది. బాలీవుడ్‌లో ఎంతో మంది ముద్దుగుమ్మలు ఉన్నా ఈ అమ్మడికి అరుదైన గౌరవం, గుర్తింపులు దక్కుతున్నాయి. తాజాగా ది హాలీవుడ్ రిపోర్టర్ మ్యాగజైన్ కవర్ పై ఈ అమ్మడికి చోటు దక్కింది. బాలీవుడ్‌కి చెందిన అతి తక్కువ మంది హీరోయిన్స్‌కి ఈ అరుదైన గౌరవం దక్కిందని ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.
రష్మిక మందన్న త్వరలో చావా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన చావా సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్న నటించింది. బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవలే రష్మిక పాత్రకు సంబంధించిన లుక్ రివీల్ అయ్యింది. ఆ పాత్రకు రష్మిక న్యాయం చేసే విధంగా లుక్ ఉంది అంటూ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. సక్సెస్ జోష్ మీద ఉన్న రష్మిక మందన్న మరో విజయాన్ని తన ఖాతాలో చావా సినిమా ద్వారా దక్కించుకోవడం ఖాయం అనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో రష్మికకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఆ ఫాలోయింగ్, వరుస సక్సెస్‌ల కారణంగానే ది హాలీవుడ్ రిపోర్టర్ మ్యాగజైన్ కవర్ పై ఎక్కింది. ఎంతో మంది హాలీవుడ్ ముద్దుగుమ్మలు అతి కొద్ది మంది బాలీవుడ్ ముద్దుగుమ్మలకు దక్కిన ఈ అవకాశం మన నేషనల్ క్రష్ కి దక్కింది అంటూ అభిమానులు ఈ కవర్ ఫోటోలను తెగ షేర్ చేస్తున్నారు. నెట్టింట ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బ్లాక్ డ్రెస్‌లో కవ్వించే చూపులతో రష్మిక మందన్న కెమెరాకు ఇచ్చిన ఫోజ్‌తో నెటిజన్స్ కిల్ అవుతున్నారు. కిల్లింగ్ లేడీ అంటూ రష్మిక ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు. స్కిన్ షో ఎక్కువ చేయకున్నా సోషల్ మీడియాలో ఈ స్థాయిలో వైరల్ కావడం విశేషం.
రష్మిక మందన్న చేతిలో ప్రస్తుతం మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. కొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇటీవల కాలికి గాయం కావడంతో కనీసం నడవలేని పరిస్థితుల్లో ఉంది. ఒక్క కాలుపైనే రష్మిక నడుస్తున్న వీడియోలు ఈమధ్య కాలంలో వైరల్ అయ్యాయి. అంతే కాకుండా రష్మిక వీల్ చైర్‌లో కూర్చుని ఉన్న వీడియోలు వైరల్ అయ్యాయి. దాదాపు రెండు నెలల పాటు రష్మిక మందన్న షూటింగ్‌కి హాజరు అయ్యే అవకాశాలు లేవని సమాచారం అందుతోంది. త్వరలోనే రష్మిక మందన్న తన షూటింగ్స్‌ను ప్రారంభించాలని అభిమానులు కోరుకుంటున్నారు. నేషనల్ క్రష్ నుంచి రాబోతున్న చావా సినిమా హిట్ అయితే బాలీవుడ్‌లో మరింత బిజీగా ఈ అమ్మడు మారే అవకాశాలు ఉన్నాయి.