ఆ సినిమాపై రష్మిక కాన్పిడెన్స్ రిటైర్మైంట్ ఇచ్చేంతగా!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా `ఛావా` చిత్రంలో ఏసుబాయి పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా `ఛావా` చిత్రంలో ఏసుబాయి పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. `ఛత్రపతి` శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా లక్ష్మణ్ ఉట్టేకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలిసిందే. శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్- ఆయన భార్య ఏసుభాయి పాత్రలో రష్మిక మందన్నా నటిస్తున్నారు. ఇప్పటి కే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది.
రష్మిక ఏసుబాయి ఆహార్యంలో ఒదిగిపోయింది. ఇలాంటి ఛాలెంజింగ్ రోల్ ఇంత వరకూ రష్మిక పోషించలేదు. ఇప్పటి వరకూ కేవలం కమర్శియల్ చిత్రాల్లోనే నటించిన అమ్మడు తొలిసారి సాహసోపేతమైన రోల్ లో నటించి లుక్ తోనే మంచి ప్రశంసలు అందు కుంటుంది. తాజాగా ఏసుబాయి పాత్ర గురించి రష్మిక ఎంత గొప్పగా చెప్పిందంటే? ఈ సినిమా తర్వాత రిటైర్ అయిపోయినా పర్వాలేదు. జన్మంతా ఈ ఒక్క పాత్ర చెప్పుకోవడానికి నిలిచిపోతుందనే ధీమాని వ్యక్తం చేసింది.
మొదటి సారి ఈ స్రిప్ట్ నాదగ్గరకు వచ్చినప్పుడు ఈ పాత్రతో నేను లోలైన అనుబంధాన్ని కలిగి ఉన్న అనుభూతి కలిగింది. ఇలాంటి పాత్రలే మన ప్రయాణాన్ని మరింత ఉత్తేజకరంగా మారుస్తాయి. ఏసుబాయి పాత్రలో నటించడం ఓ గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఇలాంటి అవకాశం అందరికీ రాదు. అదృష్టం కొద్ది నాకు వచ్చిందని భావిస్తున్నాను. ఈ సినిమా తర్వాత సంతోషంగా రిటైర్ అవ్వొచ్చు. అందులో ఎలాంటి డౌట్ పెట్టుకోవాల్సిన పనిలేదు` అని తెలిపింది.
అంటే ఈ సినిమా విజయంపై అమ్మడు ఎంత ధీమాగా ఉంది? పాత్రపై తానెంత కాన్పిడెంట్ గా ఉందన్నది అద్దం పడుతుంది. యానిమల్, పుష్ప విజయాలతో రష్మిక పాన్ ఇండియాలో సంచలనమైన సంగతి తెలిసిందే. సోలోగానూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటే అవకాశాలు వరిస్తున్నాయి. కానీ కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది.